దేశాన్ని సరైన దిశలో తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు : సీఎం కేసీఆర్
- March 04, 2022
రాంచీ: సీఎం కెసిఆర్ జాతీయ స్థాయిలో తృతీయ కూటమి కోసం యత్నాలు చేస్తున్నారు. ఆ దిశగా మూడు రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకున్న కేసీఆర్ తిరుగు ప్రయాణంలో భాగంగా ఝార్ఖండ్ వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్‌తో భేటీ అయ్యారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాట్లు, ఆ దిశగా సాగాల్సిన ఆవశ్యతపై ఆయన సోరేన్‌తో చర్చించారు. ఈ సందర్భంగా దేశ అభివృద్దిపై కేసీఆర్ తనదైన వ్యాఖ్యలు చేశారు.
దేశానికి సరకొత్త దశ, దిశ కోసం ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నామని కేసీఆర్ చెప్పారు. దేశాన్ని సరైన దిశలో తీసుకెళ్లేందుకు చర్చలు ప్రారంభమయ్యాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రం 70 ఏళ్లు దాటినా దేశంలో ఆశించిన మేర అభివృద్ది జరగలేదని కేసీఆర్ అన్నారు. దేశంలో ఇప్పటికంటే మెరుగైన అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్పారు. దేశాన్ని సరైన దిశలో నడిపేందుకు ఏ మార్గాన్ని అనుసరిస్తే బాగుంటుందన్న దానిపై ఆలోచన చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా దేశంలో ప్రత్యామ్నయంపై త్వరలోనే నిర్ణయం ఉంటుందని కూడా కేసీఆర్ చెప్పు కొచ్చారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్: కొలంబో నుండి కువైట్‌కు వారానికి 6 విమానాలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







