స్వదేశానికి వెళ్లేందుకు ఆశ పడుతున్న కార్మికులు

- April 01, 2016 , by Maagulf
స్వదేశానికి  వెళ్లేందుకు ఆశ పడుతున్న కార్మికులు

సిత్ర లో ఒక కార్మిక శిబిరంలో నివసిస్తున్న అసంతృప్త కార్మికుల సమూహం బాధాకరమైన జీవితం నుండి తప్పించుకోవడానికి తమ సొంత దేశానికి వెళ్ళడానికి ఎంతో  ఆత్రుతతో ఉన్నారు.ఈ భారత కార్మికులు అత్యంత అనారోగ్యమైన పరిస్థితుల నడుమ దుర్భర జీవనంల్ వారిని  నివసించమని  బలవంతంగా ఇక్కడ ఉంచుతున్నారు.వారి నివాసంలో 67 మందికి  అక్కడ ఒకే బాత్రూమ్ ఉంది. విపరీతమైన మురికితో చెడ్డ వాసన వెదజల్లుతూ వారి బెడ్ రూములు మరియు వంటగది  ఉన్నాయి.భారతదేశం లో ఒక రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా మోసానికి గురైన ఈ కార్మికులకు  "మంచి జీతం ఇస్తారు  మరియు ఎంతో తేలికైన పని."  కొందరు వారికి మోసకరమైన హామీలతో నమ్మబలికేరు. వాస్తవానికి ఇక్కడ    దీర్ఘ పనిగంటలు మరియు నివసించే వీలు లేని అనైతిక పరిస్థితులు ప్రతిరోజు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నామని ఆ కార్మికులు తమ బాధను  వ్యక్తం చెశారు. " మాకు  200 బహేరిన్ దినార్ల  జీతం ఇస్తామని రిక్రూటింగ్ ఏజెన్సీ వాగ్దానం చేసింది, కానీ ఇప్పుడు మేమునెలకు100బహేరిన్దినార్లవస్తేఅదేపెద్దఅదృష్టమనిభావిస్తున్నామని...కొన్నిసార్లు మాకు 20 బహేరిన్ దినార్ల పొందేందుకు మాత్రమే అర్హులమని ఒక రియాస్ కార్మికుడు వాపోయారు.  "మేము ఉండడానికి ఒక మంచి స్థలం మరియు అత్యంత సౌకర్యవంతమైన ప్రాంతంలో  ఉద్యోగం ఉంటుందని చెప్పారు. మేము  ఒక భయంకరమైన ఉచ్చులో ఇరుక్కుపోయాము. బహేరిన్ విమానాశ్రయం వద్ద దిగిన వెంటనే వారు  మా పాస్పోర్ట్ జప్తు చేసారు. మమ్ముల్ని తెచ్చిన వారికి ఇక్కడ ఒక్కొక్క వ్యక్తికి 1,000 బహేరిన్ దినార్లు ఇక్కడ రిక్రూటింగ్ ఏజెన్సీ మాపై పొందింది. కొన్ని మోసపూరిత పత్రాలపై సంతకాలు చేయడంతో మేము అన్యాయంగా ఇక్కడ  చిక్కుకున్నట్లు  మరో కార్మికుడు ఆవేదన చెందాడు. ""వారు మాకు ఇక్కడ రాత్రి పగలు ఒకటే పని వత్తిడి పెడుతున్నారు. వారు మాకు ఊపిరి తీసుకొనే  సమయం కూడా ఇవ్వడం లేదు. మాలో చాలా మందికి  రెండు లేదా మూడు నెలల జీతాలు కూడా రావడం లేదు. ఒకసారి వారు మాపై భౌతికంగా సైతం దాడి చేస్తున్నారు. ఎవరైనా ఇక్కడ్నుంచి వదిలించుకు   రావాలంటే 1,000 బహేరిన్ దినార్ల చెల్లించటానికి సిద్ధంగా ఉండాలి 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com