పత్రికలో వచ్చిన వార్త చూసి స్పందించిన ఉపరాష్ట్రపతి
- March 10, 2022
విజయవాడ: ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మరోసారి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.విజయవాడకు చెందిన విధివంచిత కుటుంబానికి తమ జీతం నుంచి లక్షరూపాయల ఆర్థిక సాయం అందించారు.రోజూ దినపత్రికలు చదవడంలో భాగంగా, విజయవాడ దినపత్రికలో వచ్చిన చిన్న వార్త ఆయన్ను కదిలించింది.
విజయవాడకు చెందిన చింతా కుమారి, శివప్రసాద్ లు ప్రేమించి మతాంతర వివాహం చేసుకున్నారు.ఎలక్ట్రిషియన్ గా భర్త సంపాదనతో హాయిగా సాగుతున్న వారి జీవితంలో కష్టాలు ప్రవేశించాయి.శివప్రసాద్ పిట్టగోడ మీద కూర్చుని ఉండగా, ఆ గోడ హఠాత్తుగా పడిపోవడం వల్ల ఆయన వెన్ను దెబ్బతింది. భర్త భారంతో పాటు, పిల్లల భారాన్ని మోస్తున్న ఆమె గురించి పత్రికలో వచ్చిన వార్తను చూసిన ఉపరాష్ట్రపతి వెంటనే వివరాలు కనుక్కోవలసిందిగా సహాయకులను ఆదేశించారు.
వివరాలు తెలిసిన వెంటనే ముందుగా ఆయన జీతం నుంచి లక్షరూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు.భర్తకు అమ్మలా మారి, పిల్లలకు ఆదరువుగా ఆమె నిలబడిన విధానం ప్రతి మహిళకూ స్ఫూర్తిదాయకమంటూ ఆయన అభినందించారు.ఎన్ని కష్టాలు ఎదురైనా కుంగిపోకుండా, కుమారిలా జీవితంలో నిలబడాలని ఆయన అభిప్రాయపడ్డారు.
పత్రికలో వచ్చిన చిన్న వార్తకు స్పందించి తమకు వెంటనే లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించిన ఉపరాష్ట్రపతి ఔదార్యానికి చింతా కుమారి,శివప్రసాద్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజా వార్తలు
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు







