మద్య రహిత రాష్ర్టంగా బీహార్...
- April 01, 2016
బీహార్ మద్య రహిత రాష్ర్టంగా కాబోతుంది. బీహార్ ఎన్నికల్లో గెలిచి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నితీష్ కుమార్ ఏప్రిల్ 1 నుంచి దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని ప్రకటించిన విషయం విదితమే. ఈ క్రమంలో నేటి నుంచి బీహార్లో మద్యం అమ్మకాలు నిలిచిపోనున్నాయి. పూర్తి స్థాయిలో కాకుండా పాక్షికంగా మద్య నిషేధం అమలు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దేశీయంగా ఉత్పత్తవుతున్న మద్యంతో పాటూ, స్పైస్ లిక్కర్ ను కూడా నిషేధించారు. దీంతో బీహార్ వ్యాప్తంగా 13 లక్షల మద్యం సీసాలను అధికారులు ధ్వంసం చేశారు. ప్రభుత్వ హెచ్చరికను లెక్కచేయకుండా మద్యం అమ్మకాలు చేపడితే కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







