బాహుబలి 3: బిగ్ అప్డేట్ ఇచ్చిన జక్కన్న
- March 14, 2022
హైదరాబాద్: 'బాహుబలి' సిరీస్ లో వచ్చిన రెండు చిత్రాలు ఇండియాను ఊపేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.
దర్శకుడిగా రాజమౌళి కీర్తిప్రతిష్ఠలు ఆకాన్నంటాయి. మరోవైపు 'బాహుబలి' పార్ట్ 3 వస్తే బాగుంటుందని ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. 'బాహుబలి-3'పై ఇటీవల 'రాధే శ్యామ్' ప్రమోషన్ కార్యక్రమాల్లో ప్రభాస్ మాట్లాడుతూ, పార్ట్ 3 గురించి తనకు తెలియదని, సమయం వచ్చినప్పుడు ఏదైనా జరిగే అవకాశం ఉందని చెప్పాడు.
తాజాగా 'బాహుబలి-3'పై రాజమౌళి పూర్తి క్లారిటీ ఇచ్చారు. పార్ట్ 3 తప్పకుండా వస్తుందని ఆయన స్పష్టం చేశారు. బాహుబలి చుట్టూ జరిగే సంఘటనలను ఈసారి ప్రేక్షకులకు చూపిస్తామని చెప్పారు. మూడో పార్ట్ కు సంబంధించి వర్క్ చేస్తున్నామని తెలిపారు. నిర్మాత శోభు యార్లగడ్డ కూడా సుముఖంగా ఉన్నారని చెప్పారు. అయితే సినిమా రావడానికి కొంత సమయం పట్టొచ్చని అన్నారు. త్వరలోనే బాహుబలి రాజ్యం గురించి ఆసక్తికర వార్త రానుందని చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్: కొలంబో నుండి కువైట్‌కు వారానికి 6 విమానాలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







