తెలంగాణ జాగృతి ఖతార్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
- March 14, 2022
దోహా: తెలంగాణ జాగృతి ఖతార్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని తెలిపిన వివరాల ప్రకారం,
దోహా ఖతార్,ఇండియన్ కల్చరల్ సెంటర్ లో జరిగిన ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఖతార్ లోని భారత రాయబార కార్యాలయం కార్యదర్శులు సుమన్ సోన్కర్ మరియు పద్మ కర్రి ముఖ్య అతిథులుగా హాజరు కాగా ప్రవాస భారత్ సమ్మాన్ అవార్డు గ్రహీత, ఇండియన్ స్పోర్ట్స్ సెంటర్ అధ్యక్షులు డా.మోహన్ థామస్, ఐసిసి అధ్యక్షుడు పిఎన్ బాబు, ఐసిసి జనరల్ సెక్రటరీ కృష్ణ కుమార్ బంధకవి,ఖతార్ లో తెలుగు విద్యావేత్త, సీనియర్ తెలుగు ప్రవాస నాయకులు ప్రసాద్ రావు కొడూరు గారు, ఖతార్ లో వివిధ తెలుగు సంఘాల అధ్యక్షులు తాతాజీ వుసిరికల, వెంకప్పా భాగవతుల,శంకర్ గౌడ్ విశిష్ట అతిథులుగా హాజరై మహిళా సాధికారత ఆవశ్యకతను తెలియచేశారు.
ఖతార్ లో వివిధ సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఎన్నోసేవా కార్యక్రమాలు చేస్తూ , సాంస్కృతిక , సాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తూ తాము ఏ రంగంలో అయినా ఎవరికీ తీసిపోమని నిరూపిస్తూ ఇతర మహిళలకు ఆదర్శంగా, స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న
ఐసిబిఎఫ్ వైద్య సహాయ మరియు శిబిరాల ఇంచార్జి రజనీ మూర్తి, ట్రెజరర్ కుల్దీప్ కౌర్, ఐసీసీ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్లు జయతి బి మైత్ర, సొనల్ శర్మ, జకియా బిల్గ్రమి ఫారుఖి మరియు తమ జీవిత భాగస్వామి కి అన్ని వేళలా సహకరిస్తూ వాళ్లు అనుకున్న లక్ష్యాలను అందుకునేలా అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తు వారి విజయాల్లో కీలక భూమిక నిర్వహిస్తున్న వాణి ,విద్య మీనన్,రాధ మరియు మానసిక వైద్య నిపుణులు డా.హర్ష భాటియా ను ఈ సంధర్భంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో భాగంగా జరిగిన కళల పోటీ లో విజేతలుగా నిలిచిన వారికి మోమెంటోలను అంద చేశారు.
విదేశాల్లో మన భారత సాంప్రదాయ వస్త్రాధరణను ప్రొత్సాహించడానికి,ప్రచారాన్ని కల్పించాలనే సంకల్పంతో తలపెట్టిన ‘సంప్రదా, ఎన్ ఎక్సట్రా ఆర్డినెరీ నారీ ఇన్ సారీ’, ఆడపిల్లలకు 'బుట్ట బొమ్మ' అనే శీర్షిక తో నిర్వహించిన ఫాషన్ షొలు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి.పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
మహిళా మరియు శిశు అభివృద్ధి సలహాదారులు, సుమ గౌడ, ఫ్యాషన్ రంగ నిపుణులు సునైన కనుమర్లపూడి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టకున్నాయి.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)





తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







