మేకపాటి గౌతమ్‌రెడ్డి శాఖలు మంత్రి బుగ్గనకు కేటాయింపు

- March 14, 2022 , by Maagulf
మేకపాటి గౌతమ్‌రెడ్డి శాఖలు మంత్రి బుగ్గనకు కేటాయింపు

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దివంగత నేత, మంత్రి మేకపాటి గౌతం రెడ్డి.. బాధ్యతలను బదలాయిస్తూ.. జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అసెంబ్లీ బాధ్యతలను.. మంత్రి అప్పల రాజుకు ఇప్పటికే అప్పగించగా.. మంత్రి పదవి బాధ్యతలను కూడా బదలాయించారు జగన్.

దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి శాఖలు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజెంద్ర నాధ్ కు కేటాయించారు. ఇప్పుడు ఉన్న ఫైనాన్స్, శాసనసభ వ్యవహారాలు, కమర్షియల్ టాక్స్ శాఖలకు అదనంగా ఐటీ, పరిశ్రమలు, కామర్స్ శాఖలు బుగ్గనకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com