చైనాను వణికిస్తున్న స్టెల్త్ ఒమిక్రాన్ వేరియంట్
- March 16, 2022
కరోనా ముప్పు నుంచి కోలుకుంటున్న ప్రపంచ దేశాల్లో మళ్లీ అలజడి రేగింది. చైనాలో కొత్త వేరియంట్ స్టెల్త్ ఒమిక్రాన్దడ పుట్టిస్తోంది. ఒక్కరోజే అత్యధికంగా 5వేల 280 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో ఎక్కువగా ఈశాన్య చైనాలోని జిలిన్ప్రావిన్స్లోనే వెలుగు చూసినట్లు అధికారులు వెల్లడించారు. ఒక్కసారిగా కేసులు పెరుగుతుండటంతో 13 పెద్ద నగరాలను మూసివేసింది చైనా. దీంతో 3 కోట్ల మందికి పైగా ప్రజలు లాక్డౌన్లోకి వెళ్లారు. చాలా పరిశ్రమలు మూతపడ్డాయి. ప్రజా రవాణాను నిలిపివేశారు. జిలిన్, చాంగ్‌చున్, షెన్ ఝెన్, షాంఘై, లాంగ్‌ఫాంగ్ వంటి నగరాల్లో ఆంక్షలు విధించారు. ఎక్కడికక్కడ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. బీజింగ్‌లోనూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ నగరంతో పాటు, షాంఘైకి రాకపోకలు సాగించే విమానాలను రద్దు చేశారు.
వేగంగా వ్యాపస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా దక్షిణకొరియా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. నిన్న ఒక్కరోజే 3లక్షల 62వేల 283 కేసులు నమోదు కాగా, 293 మంది చనిపోయారు. కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి దక్షిణకొరియాలో అత్యధిక మరణాలు నమోదవడం ఇదే తొలిసారని అధికారులు వెల్లడించారు. మరో 11వందల 96 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. దక్షిణకొరియాలో మొత్తం కేసుల సంఖ్య 72 లక్షలకు చేరింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆందోళనకరమేనన్నారు.
ఈ ఏడాది జూన్ ఆఖరులో నాలుగో వేవ్ ఉంటుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. అక్టోబర్ నాటికి తగ్గిపోతుందని అంటున్నారు. ఒమిక్రాన్ వైరస్ వేగంగా వ్యాపించినా.. దాని తీవ్రత తక్కుగానే ఉందన్నారు. వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారు స్వల్ప లక్షణాలతో త్వరగా కోలుకుంటున్నారన్నారు.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం