కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య విరామం తగ్గింపు
- March 20, 2022
న్యూఢిల్లీ: కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య విరామం తగ్గింది. ఇప్పటి వరకు ఈ వ్యాక్సిన్ తొలి డోసు-రెండో డోసుకు మధ్య 12-16 వారాల విరామం ఉండగా, ఇప్పుడు అది 8-16 వారాలకు తగ్గింది. ఈ మేరకు నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్‌టాగి) పేర్కొంది. కొవిషీల్డ్ రెండో వ్యాక్సిన్ ను 8 వారాల తర్వాత ఇచ్చినప్పుడు, 12-16 వారాల తర్వాత ఇచ్చినప్పుడు శరీరంలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీల ప్రతిస్పందన దాదాపు సమానంగా ఉన్నట్టు ఇటీవలి అధ్యయనంలో తేలింది. ఈ నేపథ్యంలోనే ఎన్‌టాగి ఈ ప్రతిపాదన చేసింది. ప్రపంచంలోని పలు దేశాల్లో మళ్లీ కరోనా కేసులు వెలుగు చూస్తూ భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు డోసుల మధ్య వ్యవధి తగ్గించడం వల్ల మిగిలిన 6-7 కోట్ల మందికి వ్యాక్సినేషన్ సులభమవుతుందని భావిస్తున్నారు.
భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్ టీకా విషయంలో రెండు డోసుల మధ్య విరామంలో ఎలాంటి మార్పు లేదని ఎన్‌టాగి పేర్కొంది. ఈ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య విరామం 28 రోజులుగా ఉంది. కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కలిసి అభివృద్ధి చేశాయి. దీనికి పూణెలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తోంది.
తాజా వార్తలు
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు







