పాన్-ఆధార్ కార్డు లింకు: మార్చి 31 డెడ్‌లైన్..
- March 21, 2022
న్యూ ఢిల్లీ: దేశంలో కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందుకోవాలంటే పాన్‌కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయించడం తప్పనిసరి. అయితే ఇంకా చాలా మంది పాన్-ఆధార్ లింక్ ప్రక్రియను పూర్తి చేయలేదు. ముఖ్యంగా పన్ను కట్టే వ్యాపారులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరూ పాన్, ఆధార్ లింక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాంటి వారు మార్చి 31 లోపు ఆధార్, పాన్ కార్డును లింక్ చేసుకోవాలని కేంద్రం సూచించింది.
కరోనా కారణంగా ఆధార్, పాన్ లింక్ గడువు తేదీని ఈ ఏడాది మార్చి 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) పొడిగించింది. అయితే.. ఈసారి మాత్రం ఇక గడువును పొడిగించేది లేదని సీబీడీటీ స్పష్టం చేసింది. మార్చి 31 లోపు ఆధార్, పాన్‌ను లింక్ చేసుకోకపోతే రూ.10 వేల జరిమానా విధిస్తామని సీబీడీటీ హెచ్చరించింది. పాన్, ఆధార్ లింక్ చేయడం కోసం http://www.incometaxindiaefiling.gov.in అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి లింక్ ఆధార్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, పూర్తి పేరు, ఇతర వివరాలు అందించాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి.. లింక్ ఆధార్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. అనంతరం 10 రోజుల్లో ఆధార్, పాన్ కార్డు లింకింగ్ పూర్తవుతుంది.
తాజా వార్తలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత







