ఫేక్ ఆన్లైన్ ఖాతాలు సృష్టిస్తే భారీ జరిమానాలు
- March 23, 2022
యూఏఈ: నకిలీ ఇమెయిల్‌లు, వెబ్సైట్లు, ఆన్లైన్ ఖాతాలను సృష్టించే వారికి విధించే జరిమానాలను వివరిస్తూ UAE పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఒక షార్ట్ ఫిల్మ్ ను విడుదల చేసింది. వీడియో ప్రకారం.. పుకార్లు, సైబర్‌క్రైమ్‌లను ఎదుర్కోవడంపై ఫెడరల్ డిక్రీ-లా నంబర్ 34 2021లోని ఆర్టికల్ (11) ప్రకారం, ఎవరైనా నకిలీ వెబ్సైట్, ఆన్లైన్ ఖాతా లేదా ఇ-మెయిల్‌ను సృష్టించిన పక్షంలో జైలుశిక్ష, జరిమానా (50,000 Dhs - 200,000 Dhs వరకు) లేదా రెండింటిలో ఏదైనా ఒకటి విధిస్తారు. ఫేక్ వెబ్సైట్, ఆన్లైన్ ఖాతా లేదా ఇ-మెయిల్‌ని ఉపయోగించి ఎవరైనా వ్యక్తికి హాని కలిగించేందుకు ఉపయోగించినట్లయితే లేదా అనుమతించినట్లయితే, అపరాధికి కనీసం రెండేళ్ల జైలు శిక్ష, ఫైన్ విధించబడుతుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వివరించింది. నకిలీ వెబ్సైట్, ఆన్లైన్ ఖాతా లేదా ఇ-మెయిల్ లతో UAE సంస్థలా చెప్పుకుంటూ మోసానికి పాల్పడితే.. ఐదేళ్ల వరకు జైలు శిక్ష, Dhs200,000 వరకు జరిమానా విధించబడుతుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్-బెంగళూరు హైవేపై కీలక నిర్ణయం. 6 వరుసలకు విస్తరణ
- ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం..1.75 లక్షల వీసాలు రద్దు
- భారతీయుడిని తరలించిన ఒమన్ రాయల్ ఎయిర్‌ఫోర్స్..!!
- సౌదీలో 27,360 షెవర్లే కార్ల రీకాల్.. ఎయిర్‌బ్యాగ్ లో లోపం..!!
- కొలంబియాను వణికించిన భూకంపం..132కి పెరిగిన మృతుల సంఖ్య
- కార్ల అద్దాలకు 50 శాతం వరకు టింట్ అనుమతించాలని ప్రతిపాదన..!!
- కువైట్‌లో ప్రవాసులకు కీలక హెచ్చరిక.. కమర్షియల్ కన్సీల్మెంట్పై కఠిన నిబంధనలు..!!
- ‘ఇన్‌స్టా పేరెంటింగ్’తో పిల్లలకు ముప్పు.. యూఏఈ వైద్యుల హెచ్చరిక..!!
- రాత్రివేళ లైట్లు లేకుండా డ్రైవింగ్ చేస్తే QR10,000 వరకు జరిమానా..!!
- 1601 సిరీస్ నంబర్లను అందుబాటులోకి తెచ్చిన TRAI..!







