MOCI వెబ్‌సైట్‌లో ధరల నియంత్రణ వ్యవస్థ

- March 23, 2022 , by Maagulf
MOCI వెబ్‌సైట్‌లో ధరల నియంత్రణ వ్యవస్థ

కువైట్: వినియోగదారుల కోసం తన అధికారిక వెబ్‌సైట్‌లో వస్తువుల ధరలను పర్యవేక్షించే వ్యవస్థను కువైట్ వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ(MOCI) ప్రారంభించింది. వినియోగదారులు ఇప్పుడు ఇంటి నుండి బయలుదేరే ముందే ఒక మార్కెట్ నుండి మరొక మార్కెట్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా సహకార సంఘాలు, సూపర్ మార్కెట్లు,  ఇతర విక్రయ కేంద్రాలలో ప్రాథమిక ఆహార పదార్థాల ధరలను చెక్ చేసుకోవచ్చని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. డైలీ సహకార సంఘాల ద్వారా ధరల డేటా అప్ డేట్ చేయబడుతుందని మంత్రిత్వ శాఖ వివరించింది. కృత్రిమ ధరల పెరుగుదలను నిరోధించే ప్రయత్నాలలో భాగంగా సప్లై, డిమాండ్ వ్యవస్థకు అనుగుణంగా వాటిని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తామని పేర్కొంది. ఈ వ్యవస్థ మంత్రిత్వ శాఖ ఇన్‌స్పెక్టర్ల పనిని సులభతరం చేస్తుంది. ధరల పర్యవేక్షణ, నియంత్రణలో వారికి సహాయపడుతుందని, ధరలో కృత్రిమ పెరుగుదలను నియంత్రిస్తుందని తెలిపింది. ఫెడరేషన్ ఆఫ్ సొసైటీస్, ప్రైవేట్ సెంట్రల్ మార్కెట్ల సహకారంతో ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com