ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో సౌదీ ప్రయాణీకుడి అరెస్ట్‌

- April 02, 2016 , by Maagulf
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో సౌదీ ప్రయాణీకుడి అరెస్ట్‌

భారతదేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ (ఐజిఐఏ)లో రియాద్‌కి చెందిన ఓ ప్రయాణీకుడ్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రయాణీకుడి నుంచి ఓ పిస్తోల్‌ని వారు స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సిఐఎస్‌ఎఫ్‌) సిబ్బంది, ఐజిఐఏ రక్షణలో కీలక భూమిక పోషిస్తున్నారు. రెగ్యులర్‌ చెకప్స్‌లో రియాద్‌ ప్రయాణీకుడి నుంచి గన్‌ని వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది. నిందితుడి లగేజ్‌ నుంచి ఈ గన్‌ని స్వాధీనం చేసుకున్నామని సిఐఎస్‌ఎఫ్‌ అధికారి జితేందర్‌ కుమార్‌ చెప్పారు. పిస్తోల్‌కి సంబంధించి సరైన డాక్యుమెంట్లు చూపడంలో విఫలమయ్యాడు నిందితుడు. ఐజిఐఏ పోలీసులకు నిందితుడ్ని సిఐఎస్‌ఎఫ్‌ పోలీసులు అప్పగించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com