ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో సౌదీ ప్రయాణీకుడి అరెస్ట్
- April 02, 2016
భారతదేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (ఐజిఐఏ)లో రియాద్‌కి చెందిన ఓ ప్రయాణీకుడ్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రయాణీకుడి నుంచి ఓ పిస్తోల్ని వారు స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) సిబ్బంది, ఐజిఐఏ రక్షణలో కీలక భూమిక పోషిస్తున్నారు. రెగ్యులర్ చెకప్స్‌లో రియాద్ ప్రయాణీకుడి నుంచి గన్ని వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది. నిందితుడి లగేజ్ నుంచి ఈ గన్ని స్వాధీనం చేసుకున్నామని సిఐఎస్ఎఫ్ అధికారి జితేందర్ కుమార్ చెప్పారు. పిస్తోల్కి సంబంధించి సరైన డాక్యుమెంట్లు చూపడంలో విఫలమయ్యాడు నిందితుడు. ఐజిఐఏ పోలీసులకు నిందితుడ్ని సిఐఎస్ఎఫ్ పోలీసులు అప్పగించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







