బహ్రెయిన్‌లో ఇండియన్ రెస్టారెంట్‌కు షాక్...

- March 27, 2022 , by Maagulf
బహ్రెయిన్‌లో ఇండియన్ రెస్టారెంట్‌కు షాక్...

మనామా: మనామాలో హిజాబ్ ధరించిన మహిళను లోపలికి అనుమతించని ఓ రెస్టారెంట్‌కు బహ్రెయిన్ అధికారులు తాజాగా భారీ షాకిచ్చారు.వివాక్షపూరిత చర్యలు చేపట్టినందుకు ఆ రెస్టారెంట్‌ను మూసివేశారు.మనామా లోని అదిల్యా ప్రాంతంలో గల లాంటర్న్స్ రెస్టారెంట్‌లో ఇటీవల ఈ ఉదంతం వెలుగు చూసింది.మరోవైపు..  బహ్రెయిన్ పర్యటక శాఖ అధికారులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. ‘‘వివక్షాపూరిత చర్యలను మేము ఖండిస్తున్నాం. ముఖ్యంగా తమ జాతీయతను ప్రదర్శించే వారిపై ఇటువంటి చర్యలు అస్సలు సహించం’’ అని అక్కడి అధికారి ఒకరు పేర్కొన్నారు. 

రెస్టారెంట్ యాజమాన్యం కూడా దిద్దుబాటు చర్యలకు దిగింది.ఈ ఘటనకు బాధ్యుడైన మేనేజర్ మార్చి 24నే విధుల నుంచి తొలగించినట్టు ఓ ప్రకటనలో తెలిపింది.ఇంతలో, రెస్టారెంట్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్‌ను పెట్టింది.తప్పుకు క్షమాపణలు కోరింది మరియు సద్భావన సూచనగా -- మార్చి 29న పోషకులకు కాంప్లిమెంటరీ ఫుడ్ ప్రకటించింది. ‘‘బహ్రెయిన్ లో గత 35 ఏళ్లుగా మేము అన్ని దేశాల వారికీ ఆతిథ్యం ఇస్తున్నాం. ఇకపై కూడా ఇదే విధానం కొనసాగుతుంది.ప్రతి ఒక్కరూ లాంటర్న్స్‌కు వచ్చి సంతోషంగా ఉల్లాసంగా గడపాలి. అయితే.. ఓ మేనేజర్ కారణంగా ఈసారి పొరపాటు జరిగింది. అతడి తీరు మా రెస్టారెంట్ విధానానికి పూర్తిగా విరుద్ధం.ఈ సందర్భంగా..మా రెస్టారెంట్ పాట్రన్‌లకు మరోమారు స్నేహహస్తం అందిస్తూ.. మార్చి 29న మేము కాంప్లిమెంటరీగా ఆహారాన్ని సర్వ్ చేయదలిచాము.’’ అని రెస్టారెంట్ తన ప్రకటనలో పేర్కొంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com