యూఏఈలో ఏప్రిల్ 2న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం
- March 29, 2022
యూఏఈ: అజ్మన్ లోని అల్ జూర్ఫ్ ప్రాంతంలో ఉన్న ఇండియన్ అసోసియేషన్ హాల్ లో ఏప్రిల్ 2న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని నిర్వహించనున్నారు.అలాగే జ్యోతిర్విద్యా భూషణ, బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారయణ మూర్తీ చే పంచాంగ శ్రవణం ఉంటుంది.తిరమల తరహాలో స్వామి కళ్యాణాన్ని నిర్వహించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన పూజారులు ఈ క్రతువులో పాల్గొంటున్నారు. భక్తులకు ఫ్రీ ఎంట్రీ అవకాశాన్ని కల్పించారు.
షెడ్యూల్:
07.00-08.00 సుప్రభాత సేవ
08.00-10.00 పంచాంగ శ్రవణం
09.00-11.00 హోమం
11.00-14.00 కల్యాణం
11.30-14.00 ప్రసాదం
ఈవెంట్ అసాంతం కీర్తనలు, భజనలు ఆకట్టుకోనున్నాయి. మరింత సమాచారం కోసం 055 5794466/055 9943873 నెంబర్లలో సంప్రదించగలరు.
సూచనలు:
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఈవెంట్ లో కొవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలి. మాస్కులు, సోషల్ డిస్టెన్స్ పాటించడంతోపాటు సెక్యూరిటీ గైడ్ లైన్స్ పాటించాలి.
ముఖ్యమైన గమనిక:
రమదాన్ ప్రోటోకాల్స్ ప్రకారం.. వెన్యూలో అన్న ప్రసాదాలను తినడాన్ని అనుమతించరు. భక్తులు ప్రసాదాలను తమ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







