700 గోల్డెన్ వీసాలు మంజూరు చేసిన బహ్రెయిన్
- March 29, 2022
బహ్రెయిన్: 700 గోల్డెన్ వీసాలు మంజూరు చేసినట్లు బహ్రెయిన్ తెలిపింది. గోల్డెన్ వీసా కోసం ఇప్పటి వరకు 1,680 దరఖాస్తులు అందాయని పేర్కొంది. గత నెలలో బహ్రెయిన్ ప్రభుత్వం ఎంపిక చేసిన విదేశీయులకు దీర్ఘకాలిక రెసిడెన్సీని మంజూరు చేసే గోల్డెన్ వీసా పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. వీసా హోల్డర్‌కు బహ్రెయిన్‌లో పని చేసే హక్కు, జీవిత భాగస్వామి, ఇతర సన్నిహిత కుటుంబ సభ్యులకు రెసిడెన్సీ ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే దేశంలోకి అపరిమిత ఎంట్రీ/ఎగ్జిట్ అవకాశాన్ని అందిస్తుంది. గోల్డెన్ వీసా గ్రహీతలు వీసాను నిరవధికంగా పొడిగించడానికి కూడా అనుమతిస్తుంది. వీసా కోసం బహ్రెయిన్‌లో ఐదు సంవత్సరాలు నివాసంతోపాటు నెలకు కనీసం BD2,000 సగటు జీతం పొందాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







