‘రంగ రంగ వైభవంగా’ .. జూలై 1న గ్రాండ్ రిలీజ్
- March 30, 2022
హైదరాబాద్: వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్‌పై రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రంగ రంగ వైభవంగా’ .. జూలై 1న గ్రాండ్ రిలీజ్.
‘ఉప్పెన’ సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సాధించిన యువ కథానాయకుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్‌పై బాపినీడు.బి సమర్పణలో గిరీశాయ దర్శకుడిగా బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. కేతికా శర్మ హీరోయిన్. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి జూలై 1 ఈ చిత్రాన్ని భారీ లెవల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.
తమిళంలో అర్జున్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ గిరీశాయ డైరెక్షన్‌లో లవ్, ఎంటర్‌టైన్‌మెంట్ ఎలిమెంట్స్ కలగలిసిన ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోన్న ‘రంగ రంగ వైభవంగా’ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన ఈ మూవీ టైటిల్ టీజర్, పాటకు ఆడియెన్స్ నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలుస్తుంది. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







