మస్కట్‌లో 26 డెంగ్యూ కేసులు నమోదు
- March 31, 2022
మస్కట్: గత కొద్ది రోజుల్లో ఇరవై ఆరు డెంగ్యూ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రి, హెచ్ఈ డాక్టర్ అహ్మద్ బిన్ మహ్మద్ అల్ సయీదీ తెలిపారు. COVID-19 మహమ్మారి ప్రభావాన్ని ఎదుర్కోవటానికి పనిచేసిన సుప్రీం కమిటీ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. బౌషర్ విలాయత్‌లో 17, సీబ్ విలాయత్‌లో ఏడు, మరియు రెండు డెంగ్యూ కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఏడిస్ ఈజిప్టి దోమలు వ్యాప్తి చెందడానికి అనుకూలమైన వాతావరణాన్ని మనం సృష్టించకూడదని, పౌరులు, నివాసితులు తమ ఇళ్లలోని డబ్బాలు, టైర్లు లాంటి ప్రదేశాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ఆయన కోరారు. డెంగ్యూ అనేది ఒకరి నుంచి మరొకరికి నేరుగా సంక్రమించదని, ఈడెస్ ఈజిప్టి దోమల కాటు ద్వారా మనుషులకు వ్యాపిస్తుందని హీత్ మంత్రిత్వ శాఖ (MoH) తెలియజేసింది. 2019 మరియు 2020లో మస్కట్, ధోఫర్లలో కూడా డెంగ్యూ జ్వరం నమోదు అయ్యాయని పేర్కొంది. డెంగ్యూ నివారణకు మార్గదర్శకాలను జారీ చేసింది. శరీరాన్ని కప్పి ఉంచే పొడవాటి స్లీవ్‌లు ఉన్న దుస్తులను ధరించాలని, శరీరంలోని బహిర్గత భాగాలపై దోమల వికర్షకాలను ఉపయోగించాలని, కిటికీ నెట్లను ఉపయోగించాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







