ఆర్జీవీ చేతుల మీదుగా 'దోచేవారెవరురా' టైటిల్ ఫస్ట్ లుక్ విడుదల..
- April 03, 2022
హైదరాబాద్: IQ క్రియేషన్స్ బ్యానర్ పై బొడ్డు కోటేశ్వరరావు నిర్మాతగా సీనియర్ దర్శకుడు శివ నాగేశ్వరావు తెరకెక్కిస్తున్న సినిమా 'దోచేవారెవరురా'. తాజాగా ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా విడుదలైంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'దోచేవారెవరురా' టైటిల్ చాలా బాగుంది అని.. సినిమా కూడా అంతే బాగుంటుందని నమ్ముతున్నట్లు చెప్పారు వర్మ. తనకు శివ నాగేశ్వరరావుతో మొదటి సినిమా నుంచి ప్రత్యేకమైన అనుబంధం ఉంది అని తెలిపారు. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధించాలని ఆయన కోరుకున్నారు.
దర్శకుడు శివనాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాముతో మాకు ఎప్పటినుంచో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆయనతో నేను ఉన్నంత క్లోజ్ గా మా బ్యాచ్ లో ఎవరు ఉండరు. దర్శకుడిగా నాకు మొదటి అవకాశం ఇచ్చింది ఆయనే. ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేసినందుకు థాంక్యూ.. అని తెలిపారు. ఈ చిత్రం లోఅజయ్ గోష్, బిత్తిరి సత్తి ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు
బ్యానర్ : IQ క్రియేషన్స్
దర్శకుడు: శివనాగేశ్వరరావు
నిర్మాత. : బొడ్డు కోటేశ్వరరావు
పి.ఆర్.ఓ : లక్ష్మీ నివాస్
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!







