నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేసిన జగమెరిగిన సత్యం మోషన్ పోస్టర్ !!!
- April 04, 2022
హైదరాబాద్: అమృత సత్యనారాయణ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 జగమెరిగిన సత్యం చిత్ర టైటిల్, మోషన్ పోస్టర్ ను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. అచ్చ విజయ భాస్కర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తిరుపతి పాలే దర్శకత్వం వహిస్తున్నారు. అవినాష్ వర్మ ఆద్య రెడ్డి, నీలిమ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుపుకుంటుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెలంగాణ నేపద్యంలో 1994 లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు తిరుపతి పాలే. ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా నిర్మాత అచ్చ విజయ భాస్కర్ సినిమాను గ్రాండ్ గా నిర్మించారు. మేలో సినిమాను థియేటర్స్ లో విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ... జగమెరిగిన సత్యం టైటిల్ బాగుంది. మోషన్ పోస్టర్ గ్రాండ్ గా ఉంది. మంచి కథ కథనాలతో వస్తోన్న ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. సినిమా సక్సెస్ అయ్యి చిత్ర యూనిట్ అందరికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాలని ఆశిస్తున్నాను అన్నారు. నటీనటులు: అవినాష్ వర్మ, ఆద్య రెడ్డి, నీలిమ పతకమ శెట్టి డైరెక్టర్: తిరుపతి పాలె నిర్మాత: అచ్చ విజయ భాస్కర్ కెమెరామెన్: షోయబ్ ఎడిటర్: అమర్ రెడ్డి మ్యూజిక్: సురేష్ బొబ్బిలి ప్రొడక్షన్ డిజైనర్: శ్రీపాల్ మాచర్ల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిరణ్ కుమార్ ఘటకల పీఆర్ఓ: శ్రీధర్
తాజా వార్తలు
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







