విమానయాన రంగంలో సంచలనం...
- April 04, 2022
ఫ్రాన్స్: వంటనూనెతో నడిచిన విమానం ఆకాశంలో ఎగిరింది.అంతేకాకుండా విజయవంతంగా ప్రయాణాన్ని పూర్తి చేసింది. ఇప్పటివరకు విమానాలలో ఇంధనంగా వైట్ పెట్రోల్‌నే వాడుతుండగా తాజాగా వంటనూనె వాడటం ఓ మలుపుగానే భావించాల్సి ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే..ఎయిర్ బస్ సంస్థ వారి సూపర్ జంబో విమానం ఎయిర్‌బస్ ఏ-380 పెట్రోల్ కాకుండా పూర్తిగా వంటనూనె ఇంధనంగా తొలి ప్రయాణాన్ని విజయవంతంగా ముగించింది.
ఎయిర్‌బస్ విమానం గత వారం ఫ్రాన్స్‌లోని టౌలూస్ బ్లాగ్నక్ విమానాశ్రయంలో వంటనూనెతో తయారుచేసిన సస్టెయినబుల్ విమాన ఇంధనాన్ని (ఎస్ఏఎఫ్) 27 టన్నుల వరకు నింపుకుని టేకాఫ్ అయింది.మూడు గంటల ప్రయాణం తర్వాత నైస్ విమానాశ్రయంలో విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. 100 శాతం ఎస్ఏఎఫ్తో నింగిలోకి ఎగిరిన తొలి విమానంగా ఎయిర్‌బస్ ఏ-380 రికార్డులకెక్కింది. అయితే రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా వంటనూనె ధరలు విపరీతంగా పెరిగిపోయిన కాలంలో వంటనూనెతో ప్రయాణం అంటే చాలా ఖరీదుగానే భావించాలి. అందులోనూ ప్రస్తుతం పెట్రోల్ కంటే వంటనూనె ధరలే అధికంగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవేళ వంటనూనెతో విమానాలు ప్రయాణిస్తే విమానయాన రంగం ఆర్థికంగా దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







