పుతిన్ కుమార్తెలపై ఆంక్షలకు ఈయూ సిద్ధం
- April 06, 2022
మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలెట్టిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచదేశాలతో పాటు ఆయా దేశాల కూటములు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.
అయితే ఆయా దేశాల యత్నాలు ఏమాత్రం ఫలిస్తున్న దాఖలా కనిపించడం లేదు. దీంతో యూరోపియన్ యూనియన్ (ఈయూ) కూటమి ఇప్పుడో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.
పుతిన్ కుమార్తెలు మారియా, క్యాథరినాలపై ఆంక్షలు విధించే దిశగా ఈయూ సాగుతోంది. ఇప్పటికే ఈ దిశగా ఓ డ్రాఫ్ట్ తయారు కాగా.. ఈయూ సభ్య దేశాలు దానిని పరిశీలిస్తున్నాయి. కూటమిలోని మెజారిటీ దేశాలు ఓకే అంటే. ఆ మరుక్షణమే పుతిన్ కుమార్తెలు ఇద్దరిపైనా ఆంక్షలు అమలు అవుతాయి. కుమార్తెలకు సంబంధించి లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్న పుతిన్.. ఈయూ ఈ దిశగా చర్యలు తీసుకుంటే మాత్రం మానసికంగా తీవ్రంగా కలత చెందే ప్రమాదం ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే పుతిన్ మాదిరే ఆయన కుమార్తెలకు విదేశాల్లో ఆస్తులు ఉన్నాయా? లేవా? అన్నది మాత్రం తెలియరాలేదు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







