నాగశౌర్య హీరోగా ‘కృష్ణ వ్రింద విహారి' చిత్రం -- మొదటి పాట ఏప్రిల్ 9న విడుదల
- April 07, 2022
హైదరాబాద్: యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగశౌర్య కథానాయకుడి గా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి' ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. ఇటివలే విడుదల చేసిన ఈ చిత్ర టీజర్ కు అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ని అమితంగా ఆకట్టుకుంది.
టీజర్ తో ఆకట్టుకున్న చిత్ర యూనిట్ ఇప్పుడు ప్రేక్షకులని పాటలతో అలరించడానికి సిద్దమౌతుంది. ఈ చిత్రంలో మొదటి పాట 'వర్షంలో వెన్నెల' ఏప్రిల్9న విడుదల కాబోతుంది. రొమాంటిక్ మెలోడీగా ఈ పాటని చిత్రీకరీంచారు. ఈ పాటలో నాగశౌర్య- షిర్లీ సెటియా మధ్య కెమిస్ట్రీ ముచ్చట గా వుంటుంది. మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తుండగా, శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి సాయిశ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా పనిచేస్తున్నారు.
ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ రాధిక ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
తారాగణం: నాగ శౌర్య, షిర్లీ సెటియా, రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు
సాంకేతిక విభాగం:
దర్శకత్వం: అనీష్ ఆర్. కృష్ణ
నిర్మాత: ఉషా ముల్పూరి
సమర్పణ: శంకర్ ప్రసాద్ మూల్పూరి
బ్యానర్: ఐరా క్రియేషన్స్
సంగీతం: మహతి స్వరసాగర్
డివోపీ: సాయిశ్రీరామ్
సహ నిర్మాత: బుజ్జి
ఎడిటర్ - తమ్మిరాజు
ఆర్ట్ డైరెక్టర్ - రామ్‌కుమార్
డిజిటల్ హెడ్: ఎం.ఎన్.ఎస్ గౌతమ్
పీఆర్వో: వంశీ, శేఖర్
తాజా వార్తలు
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్







