పూరీ అరెసెలు
- April 03, 2016
కావలసినవి: గోధుమ పిండి- గిన్నెడు, బొంబాయి రవ్వ- పావు గిన్నెడు, నూనె- రెండు లేక మూడు టేబుల్ స్పూన్‌లు, పెరుగు - రెండు టేబుల్ స్పూన్‌లు,
సిరప్ కోసం: పంచదార, రెండు గిన్నెలు నీళ్లు - గిన్నెలో మూడుపావులు కొలత, కుంకుమ పువ్వు చిటికెడు, నిమ్మరసం- మూడు టేబుల్ స్పూన్‌లు
తయారీ విధానం
గోధుమ పిండి, రవ్వలో రెండు స్పూన్‌లు నూనె, పెరుగు వేసి నీళ్లు సరి చూసుకుంటూ పిండి చేతులకు అంటకుండా ఉండేలా మెత్తగా కలపాలి. పిండిపై తడి బట్టను కప్పి ఒక గంట నాననివ్వండి. తర్వాత పదిపదిహేను నిమిషాల పాటు పిండిని మృదువుగా అయ్యేలా మర్దనా చేయండి. పంచదారని తీగపాకం వచ్చేలా ఉడికించండి. చిటికెడు కుంకుమ పువ్వు, నిమ్మరసం దాని కి చేర్చి సన్నని సెగమీద ఉంచుకోండి. పిండిని చిన్నచిన్న ముద్దలుగా చేసుకుని పూరీలలా వత్తుకోండి. వాటిని ముదురు ఎరుపు రంగు వచ్చేంత వరకూ వేగించి వేడివేడిగా పంచదార పాకంలో వేసి పూర్తిగా మునిగేలా చూసుకోం డి. ఐదు నుంచి పది నిముషాలు నాననిచ్చి తీసి వాటిని ఏటవాలుగా ఏదైనా ప్లేటులో అమర్చండి. దాని వలన వాటికి ఎక్కువగా ఉన్న పాకం జారిపోతుంది. చల్లారిన తరువాత ఈ పూరీ అరిసెలు కరకరలాడుతూ చాలా బాగుంటాయి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









