ఐటీ శాఖ ఈ-ఫైలింగ్ ప్రక్రియను ప్రారంభం
- April 03, 2016
కొన్ని రకాల పన్ను రిటర్నుల దాఖలుకు సంబంధించి 2016-17 అసెస్మెంట్ సంవత్సరానికి ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ ఈ-ఫైలింగ్ ప్రక్రియను ప్రారంభించింది. అదేవిధంగా పన్ను చెల్లింపు లెక్కలను సులువుగా సరిచూసుకోవడం కోసం కొత్త ఆన్లైన్ కాలిక్యులేటర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఏడాది బడ్జెట్లో పన్ను రేట్లలో మార్పుచేర్పులకు అనుగుణంగా కాలిక్యులేటర్లోనూ మార్పులు చేసినట్లు ఐటీ శాఖ పేర్కొంది. జీతాలు, వడ్డీ రూపంలో ఆదాయం లభించే వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఐటీఆర్-1(సహజ్), ఇతర వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు, హెచ్‌యూఎఫ్ (హిందూ అవిభాజ్య కుటుంబాలు), భాగస్వామ్య సంస్థల కోసం ఐటీఆర్-4ఎస్(సుగమ్) ఈ-ఫైలింగ్‌ను ఆరంభించినట్లు ఐటీ శాఖ ఉన్నతాధికారి చెప్పారు.
త్వరలోనే ఇతర ఐటీఆర్‌లను కూడా ఐటీ శాఖ పోర్టల్(http://incomtaxindiaefiling.gov.in) లో ఉంచుతామని తెలిపారు. ఐటీఆర్ ఫారాల్లో పన్ను చెల్లింపుదారులు తమ విదేశీ ప్రయాణాలు, బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించాలన్న నిబంధనను గతేడాది ఐటీ శాఖ కొత్తగా విధించడంతో వివాదం చెలరేగడం తెలిసిందే. దీంతో సరళీకరించిన ఐటీఆర్ ఫారాలను ప్రవేశపెట్టారు. ఈసారి మార్చి 30నే కొత్త ఐటీఆర్ ఫారాలను సీబీడీటీ నోటిఫై చేసింది. రిటర్నుల దాఖలుకు జూలై 31 వరకూ గడువు ఉంటుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







