రమదాన్ మాసం విశిష్టత..!
- April 08, 2022పవిత్ర రమదాన్ మాసం ఆరంభమైంది.అరబిక్ లో 'రమదాన్' ఉర్దూ లో 'రంజాన్' అని అంటారు.ఏ మతానికి చెందిన పండుగైనా.. దాని వెనుక ఒక సందేశం దాగి వుంటుంది.నిజానికి మొత్తం మానవాళి హితాన్ని ఆకాంక్షించే సందర్భమే పండుగ.రమదాన్ ‘ సైతం ఈ విషయాన్నే స్పష్టం చేస్తోంది.ఇస్లామీయ కేలండర్లో 9వ మాసం ‘రమదాన్’. ఈ మాసంలోనే ‘దివ్య ఖురాన్’ అవిర్భవించింది.క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ‘రమదాన్ మాసం’. ఈ పావన సమయంలో భక్తితో ఉపవాసం చేసిన వారి అన్ని తప్పులూ మన్నించబడతాయనీ, వీరంతా ‘రయ్యాన్’ అనే ప్రత్యేక ద్వారం గుండా స్వర్గ ప్రవేశం చేస్తారనీ పవిత్ర ఖురాన్ చెబుతోంది.
ఉపవాస విధి..
ఖురాన్ ప్రకారం రమదాన్ నెలలో విధిగా అచరించవలసిన నియమం ‘ ఉపవాసవ్రతం’. దీనిని పార్సీలో ‘ రోజా ‘ అనీ, అరబ్బీ భాషలో సౌమ్ అంటారు.ఈ మాసమంతా తెల్లవారుజామున భోజనం(సహర్) చేసి, రోజంతా ఉపవాసం ఉండి, సూర్యాస్తమయం తర్వాత దీక్షను విరమించి భోజనం (ఇఫ్తార్ ) చేస్తారు.ఉపవాసదీక్ష చేసేవారు అబద్ధం ఆడకుండా, పరనిందకు పాల్పడకుండా గడపడంతో పాటూ, శారీరక, మానసిక వాంఛలకు దూరంగా, నిగ్రహంతో వుంటూ ఆసాంతం దైవచింతనతో గడుపుతూ వుంటారు. వయోజనులైన స్త్రీపురుషులందరికీ విధిగా నిర్ణయించబడిన ఉపవాస దీక్ష విషయంలో వృద్దులు, పిల్లలు, వ్యాధిగ్రస్తులు, ప్రయాణంలో వున్నవారికి మినహాయింపు ఉంది.
ఉపవాస మంటే కేవలం ఆహార పానీయాలను మానివేయడం మాత్రమే కాదు. దీక్ష లక్ష్యం మనిషిలో దైవభీతి, దేవుడిపట్ల నమ్మకం మొదలైన మహత్తరమైన సుగుణాలను పెంపొందింపజేయడమే.ఉపవాస దీక్ష మూలంగా అల్లాహ్ పట్ల విశ్వాసం ద్విగుణీకృతం అవుతుంది. పరలోక భీతి, సహనం పెంపొందుట, దుర్వ్యసనాల నుంచి విముక్తి , దీనులపై జాలి కలుగుట, మనుషులంతా ఒక్కటనే భావన పెంపొందుట, ఆహారం పట్ల వ్యామోహం తగ్గుట,తద్వారా జీర్ణశక్తి మెరుగుపడుట వంటి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
జకాత్ (దానం)
రమదాన్ నెలలో ఉపవాసానికి ఎంత ప్రాధాన్యం ఉందో దానానికీ అంటే విలువ ఉంది. సంపన్నులు, సంపాదనాపరులంతా ఈ మాసంలో జకాత్ ‘ అచరించాలని దివ్య ఖురాన్ బోధిస్తోంది.దీని ప్రకారం ప్రతి ధనికుడు సంవత్సరాంతంలో మిగిలిన తన సంపద నుండి రెండున్నర శాతం(2.5%) చొప్పున ధన, వస్తు రూపంలో నిరుపేదలకు దానంగా యిస్తారు.పేదవారు కూడా సంతోషంగా పండుగ జరుపుకొనేలా చూడటమే ‘ జకాత్ ప్రధాన ఉద్దేశ్యం.జకాత్’ తో పాటు ‘ ఫిత్రా’ దానానికి రమదాన్ నెలలో ఎంతో ప్రాముఖ్యత వుంది. తిండి, బట్టకు నోచుకోని అభాగ్యులకు 50 గ్రాముల తక్కువ రెండు కిలోల గోధుమలను గానీ , దానికి సమానమైన ఇతర ఆహారధాన్యాలను గానీ, దానికి సమానమైన ధనాన్ని గానీ పంచిపెడతారు.ఉపవాసవ్రతాలు విజయవంతంగా ముగిసినందులకు దేవుడి పట్ల కృతజ్ఞతగా.. కుటుంబంలోని సభ్యులందరి తరపున పేదలకు అందజేస్తారు.ఉపవాస సమయంలో కలిగే చెడు తలంపులు, ఆలోచనలు, పలికిన అసత్యాలు, అనవసరపు మాటల వల్ల కలిగే పాపాన్ని ఈ ఫిత్రా దానం పటాపంచలు చేస్తుందని దివ్య ఖురాన్ చెబుతోంది.
నెలవంక కనిపించటంతో ప్రారంభం అయిన ఈ రమదాన్ పండుగ పరమాదం ముగింపులో కూడా నెలవంక కన్పించటంతో రమదాన్ పండుగ సందడి కన్పిస్తుంది.ఈ సందర్భంగా ఒకరి నొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు.ఈ పండుగ సందర్భంగా చేయు నమాజు ప్రత్యేక ప్రార్ధన ఒక ఆధ్యాత్మిక అనుభూతి , మానసిక ప్రశాంతత కలగజేస్తుంది.
అందరికీ ఒక్కడే దైవం రమదాన్ ఉపవాసం దీక్ష అద్భుతం కలది..రమదాన్ పండుగ పరమాదం అందరూ తెలుసుకోవాలి.ఈ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు హిందువులను కూడా ఆహ్వానిస్తారు.అందరూ ఒక్కటేనన్న భావన వారిది..అలా సమైక్యతా భావం చాటి చెప్పే రమదాన్ పండుగ అంటే అందరికీ ఎంతో ఇష్టం.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు