సిమ్రాన్ బ్యానర్ మీద రెండు మూవీలు
- April 03, 2016
ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని హీరోయిన్స్ అందరూ ఓ వైపు హీరోయిన్స్ గానే చేస్తూనే, మరో వైపు బిజినెస్ వైపు కూడ అడుగులు వేస్తున్నారు. నాలుగు డబ్బులు సంపాదించున్న తరువాత, వాటిని వెంటనే బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తూ, వాటిని రెట్టింపు చేసుకోవాలని చూస్తూన్నారు. ఆ విధంగా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయిన అందాల భామ సిమ్రాన్, చిత్ర నిర్మాణ రంగం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. తాజాగా 39వ ఏట అడుగుపెట్టిన ఈ సీనియర్ హీరోయిన్... సిమ్రాన్ అండ్ సన్స్ పేరిట ఓ చిత్ర నిర్మాణ సంస్థను స్టార్ట్ చేసిందట. ఈ సంస్థ ద్వారా ఇకపై ఏడాదికి రెండు సినిమాలు నిర్మించాలని టార్గెట్ గా పెట్టుకున్న వెటరన్ బ్యూటీ. అందుకోసం ప్రయత్నాలు కూడా మొదలుపెట్టిందట. ఈ సంవత్సరం తెలుగులో సిమ్రాన్ బ్యానర్ మీద రెండు మూవీలు రానున్నాయి. అయితే టాలీవుడ్ లో సిమ్రాన్ బ్యానర్ లో ఓ హీరో పెట్టుబడులు పెట్టినట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో స్టార్ డం ఉన్న హీరో కావడంతో, ఈ న్యూస్ ని బయటకు రాకుండా చూస్తున్నారు. టాలీవుడ్ కి మూల స్థంభాలుగా ఉన్న అతి కొద్ది హీరోలలో ఒకరే, సిమ్రాన్ చేయబోతున్న చిత్ర నిర్మాణ రంగంలో భాగస్వామ్యంగా వ్యవరిస్తున్నాడంట. ఇదిలా ఉంటే, ప్రస్తుతం సిమ్రాన్ సినిమాలకు పూర్తిగా స్వస్తి చెప్పిందనే చెప్పవచ్చు. తను రీ ఎంట్రి కోసం చూస్తున్నా, చాలా మంది తనని తీసుకోవటానికి అంతగా ఆసక్తి చూపించడం లేదంట.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







