భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ 'ఏజెంట్' కొత్త షెడ్యూల్ వైజాగ్ పోర్ట్ లో ప్రారంభం
- April 11, 2022
వైజాగ్: యంగ్ అండ్ డైనమిక్ స్టార్ అక్కినేని అఖిల్ హీరోగా స్టయిలీష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ 'ఏజెంట్' సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ వైజాగ్ పోర్ట్ లో మొదలైయింది. ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ని చిత్రీకరించనున్నారు.
షూటింగ్ లో భాగంగా వైజాగ్ చేరుకున్న హీరో అఖిల్ కు ఎయిర్ పోర్ట్ లో అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అఖిల్ ని చూడటానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఫ్యాన్స్ బైక్ భారీ ర్యాలీ నిర్వహించి తమ అభిమానం చాటుకున్నారు. అభిమానులు నుంచి వస్తున్న ఈ భారీ స్పందన అఖిల్ కి వున్న క్రేజుకి అద్దం పడుతుంది.
హై వోల్టేజ్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అఖిల్ పూర్తిగా మేకోవర్ అయ్యారు. ఏజెంట్ గా అఖిల్ లుక్ అందరిలో ఆసక్తిని పెంచుతుంది. తాజాగా అఖిల్ బర్త్ డే కానుకగా విడుదల చేసిన పోస్టర్ కి కూడా మంచి స్పందన వచ్చింది.
ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ రచయిత, దర్శకులు వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందించారు.
ఈ చిత్రానికి హిప్ హాప్ తమిజా సంగీతం అందించగా, రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహకుడిగా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
అజయ్ సుంకర, దీపా రెడ్డి ఈ చిత్రానికి సహ నిర్మాతలు.
తారాగణం: అక్కినేని అఖిల్, సాక్షి వైద్య, మమ్ముట్టి
సాంకేతిక విభాగం :
దర్శకత్వం: సురేందర్ రెడ్డి
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
సహ నిర్మాతలు: అజయ్ సుంకర, దీపా రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి
బ్యానర్లు: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా
కథ: వక్కంతం వంశీ
సంగీతం: హిప్ హాప్ తమిజా
డీవోపీ : రసూల్ ఎల్లోర్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్లా
స్టంట్స్: శివ
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







