జులై 22న విడుదల కానున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘కార్తికేయ 2’.
- April 11, 2022
హైదరాబాద్: ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్.. చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ 2 షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. కార్తికేయ 2ని ప్రపంచవ్యాప్తంగా జులై 22 న విడుదల చేస్తున్నారు. కమర్షియల్ చిత్రాలతో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొనసాగిస్తూ విజయాలు సొంతం చేసుకుంటున్న క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
కార్తికేయ 2 షూటింగ్ మొదలయ్యిన దగ్గర నుంచి సామాన్య ప్రేక్షకుల్లో, సినిమా ప్రముఖుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్.. నిఖిల్ కి జంటగా నటిస్తుంది. . ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు.
Saviours Emerge in crisis అంటూ ఆ మధ్య విడుదలైన నిఖిల్ బర్త్ డే పోస్టర్‌లో ఉన్న మ్యాటర్ ఆకట్టుకుంది. అదే విధంగా తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో ఇంట్రస్టింగ్ థింగ్ ఏంటంటే డాక్టర్ కార్తికేయ ప్రయాణం. శ్రీకృష్టుడి చరిత్రకి సంబంధించిన ద్వారక, ద్వాపర యుగంలో జరిగింది. ఇప్పటికి ఆ లింక్ లో కార్తికేయ శ్రీ కృష్ణుడి గురించి వెతికే ఒక ప్రయాణం.
శ్రీ కృష్ణుడు ఆయనకి సంబందించిన కథలో డాక్టర్ కార్తికేయ అన్వేషణగా శ్రీకృష్ణుడు చరిత్రలోకి ఎంటరవుతూ కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలోని భావాన్ని ఈ పోస్టర్ ద్వారా దర్శకుడు చందు మొండేటి ప్రేక్షకుల కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జులై 22న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.
నటీనటులు:
నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్, ఆదిత్యా మీనన్, తులసి, సత్య, వైవా హర్ష, వెంకట్ తదితరులు
టెక్నికల్ టీం:
కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్యం - చందు మెుండేటి
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరి& అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
కొ-ప్రొడ్యూసర్: వివేక్ కూచిభొట్ల
నిర్మాతలు: టి.జి విశ్వ ప్రసాద్&అభిషేక్ అగర్వాల్
పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







