మే 21న కువైట్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు
- April 12, 2022
కువైట్: మే 21న కువైట్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు 2022 జరుగనున్నాయి. ఈ మేరకు మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలపై డిక్రీని బుధవారం అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారిక గెజిట్‌లో ప్రచురించనుంది. అభ్యర్థుల నమోదు ఏప్రిల్ 14 నుండి 10 రోజుల పాటు కొనసాగనుంది. ఎన్నికలు మే 21 న జరిపేందుకు అన్ని ఏర్పాట్లను అధికారులు చేశారు. 10 జిల్లాల్లో రాబోయే ఎన్నికలకు అర్హులైన ఓటర్ల సంఖ్య 602,156 ఉండగా.. ఇందులో 290,239 మంది పురుషులు, 31,917 మంది మహిళలు ఉన్నారు. ఎన్నికల్లో పోటీచేసేందుకు అభ్యర్థి తప్పనిసరిగా అర్హత కలిగిన ఓటరుగా నమోదు అయి ఉండాలి. అలాగే ఒకటి కంటే ఎక్కువ జిల్లాల్లో తన అభ్యర్థిత్వాన్ని దాఖలు చేయడానికి ఎన్నికల చట్టం అనుమతించదు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటును వినియోగించుకునేందుకు వీలుగా 660కి పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







