మహేష్ తాజాగా సరికొత్త రికార్డ్
- April 04, 2016
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాతోనే కాకుండా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎక్కువ టచ్‌లో ఉండే మహేష్ తాజాగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసారు. ఏ తెలుగు హీరో సాధించని రికార్డుని మహేష్ సాధించడంతో ప్రిన్స్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.మహేష్ బాబు ట్విట్టర్‌లో ఎంత యాక్టివ్‌గా ఉంటారనే విషయం అందరికి తెలిసిందే. సినిమాకు సంబంధించిన విషయాలే కాక పర్సనల్ మేటర్స్ కూడా మహేష్ తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. శ్రీమంతుడు మూవీ టైంలో మహేష్ ఏకంగా ఓ చాట్ సెషన్‌ని ఏర్పాటు చేసి అభిమానుల్లో జోష్‌ని నింపారు. అయితే ప్రస్తుతం ఈహీరోను 2 మిలియన్ ( 20 లక్షలు) ఫ్యాన్స్ ఫాలో అవుతూ మహేష్ లిస్ట్ లో మరో రికార్డ్ చేర్చారు.ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బ్రహ్మెత్సవం చిత్రం చేస్తున్న మహేష్, త్వరలో మురుగదాస్ తో ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని చేయనున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







