'గటిమాన్ ఎక్స్‌ప్రెస్' రైలు తొలిసారిగా రేపు ప్రారంభం
- April 04, 2016
దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే 'గటిమాన్ ఎక్స్‌ప్రెస్' రైలును తొలిసారిగా రేపు ప్రారంభిస్తున్నారు. ఢిల్లీ - ఆగ్రాల మధ్య నడిచే ఈ రైలును రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు తన కార్యాలయంనుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రారంభిస్తారు. ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీనిలో 12 ఎసి కోచ్‌లున్నాయి. ఉచిత వైఫై సౌకర్యం, ఆటోమాటిక్ డోర్స్ తదితర పలు సౌకర్యాలు ఉన్నాయి.ఉదయం 8 గంటల 10 నిముషాలకు నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో బయలుదేరి ఆగ్రాకు 9 గంటల 50 నిముషాలకు చేరుతుంది. ఆగ్రాలో తాజ్‌మహల్ మూసి ఉండే శుక్రవారం తప్ప మిగిలిన రోజుల్లో ఈ రైలు ఢిల్లీ-ఆగ్రాల మధ్య నడుస్తుంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







