హత్య కేసులో 4 ఆసియా జాతీయులకి ఏడేళ్ళ జైలు శిక్ష

- April 13, 2022 , by Maagulf
హత్య కేసులో 4 ఆసియా జాతీయులకి ఏడేళ్ళ జైలు శిక్ష

దుబాయ్: ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో విభేదాల కారణంగా ఓ వ్యక్తి, ఓ మహిళను హత్య చేశాడు. ఈ ఘటనలో మరో ముగ్గురి సాయం తీసుకున్నాడు హంతకుడు. మృతురాలికీ, హంతకుడి స్నేహితుడికీ మధ్య ఆర్థిక వివాదమే ఈ హత్యకు కారణం. దుబాయ్ క్రిమినల్ కోర్టు ఈ కేసులో దోషులకు ఏడేళ్ళ కారాగార శిక్ష విధించింది. వారికి 200,000 దిర్హాముల జరీమానా విధించడంతోపాటు, శిక్షా కాలం ముగిశాక వారిని దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది న్యాయస్థానం. గత ఏడాది ఆగస్టులో ఈ హత్య జరిగింది. అల్ నఖీల్ ప్రాంతంలో ఆసియా జాతీయురాలైన ఓ బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు పోలీసులు. కేసు విచారణలో భాగంగా నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 200 దిర్హాముల గురించి జరిగిన గొడవ హత్యకు దారి తీసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com