క్యామెల్ ట్రావెల్ ఇన్స్యూరెన్స్ ను ప్రవేశపెట్టిన సౌదీ అరేబియా

- April 13, 2022 , by Maagulf
క్యామెల్ ట్రావెల్ ఇన్స్యూరెన్స్ ను ప్రవేశపెట్టిన సౌదీ అరేబియా

సౌదీ అరేబియా: సౌదీ అరేబియా క్యామెల్ క్లబ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ ను ప్రవేశపెట్టింది. ఒంటెలను రవాణా చేసే సమయంలో జరిగే ప్రమాదాల నుంచి ఈ భీమా రక్షణ ఇస్తుంది. స్విస్ ఫైనాన్స్ హౌస్‌తో క్లబ్ భాగస్వామ్యం తీసుకుని ఈ భీమా అందిస్తున్నారు. ఒంటెలను తీసుకొచ్చేటప్పుడు, తిరిగి తీసుకెళ్ళేటప్పుడు జరిగే ప్రమాదాల వల్ల వాటి యజమానులకు నష్టం వాటిల్లకుండా ఈ భీమా రక్షణ ఇస్తుంది. రవాణా సమయంలో ఒంటెల పరిస్థితిని యజమానులు తెలుసుకునేందుకూ వీలు కలుగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com