సిట్రా పోర్టులో అగ్నికి ఆముతైన బోటు: బహ్రెయిన్ ప్రాసిక్యూషన్ విచారణ
- April 13, 2022
బహ్రెయిన్: పబ్లిక్ ప్రాసిక్యూషన్, సిట్రా పోర్టులో బోటు అగ్నికి ఆహుతైన ఘటనకు సంబంధించి విచారణ ప్రారంభించింది. అగ్ని ప్రమాదం చోటు చేసుకోగానే కోస్టు గార్డు డిపార్టుమెంటుకి సమాచారమిచ్చినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి సమాచారం అందినట్లు ప్రభుత్వ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. ఈ ఘటనలో 79 ఏళ్ళ వృద్ధురాలు మృతి చెందగా, ఏడుగురు గాయాలపాలయ్యారు. అగ్ని ప్రమాదం సమయంలో ఆ బోటులోనే వీరంతా వున్నారు. ఇంధన ట్యాంకు నుంచి ఇంధనం లీక్ అవడంతో ప్రమాదం జరిగినట్లు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు. స్థానిక పోలీసులు, సాంకేతిక నిపుణులు, ఫోరెన్సిక్ నిపుణులు అలాగే సివిల్ డిఫెన్స్ అధికారుల నుంచి సమాచారం కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- ఆసియా కప్ విజేతగా భారత్
- టీ-చిప్ సెమీకాన్ కానిస్టిట్యూషన్ సమ్మిట్ ఘనవిజయం
- పవన్ కల్యాణ్ ,చంద్రబాబు సమావేశం ముగింపు..
- NATS మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
- మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
- సాయుధ పోరాటాలలో పిల్లల రక్షణకు ఖతార్ పిలుపు..!!
- ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని త్వరగా పరిష్కరించండి..!!
- దుబాయ్ లో డ్రైవర్ లెస్ భారీ వాహనాల కోసం పైలట్ రూట్స్..!!
- హవల్లిలో అక్రమ గర్భస్రావ క్లినిక్..ప్రవాసి అరెస్టు..!!