ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం పోరస్ కెమికల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం

- April 14, 2022 , by Maagulf
ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం పోరస్ కెమికల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం

ఏలూరు: జిల్లాలోని ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్‌ రసాయన పరిశ్రమలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

ప్రాథమిక సమాచారం మేరకు యూనిట్‌-4లో గ్యాస్‌ లీకై మంటలు చెలరేగి రియాక్టర్‌ పేలిపోయింది. మంటల ధాటికి ఆరుగురు మృతి చెందారు. ఘటనాస్థలంలోనే ఐదుగురు సజీవదహనమవగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మరోకరు మృతి చెందారు. 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో నలుగురు బిహార్‌ వాసులున్నట్లు గుర్తించారు. బాధితులను మొదట నూజివీడు ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడ జీజీహెచ్‌ తీసుకెళ్లారు.

అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కొంతసేపటి తర్వాత మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో 150 మంది ఉన్నట్లు బాధితులు చెబుతున్నారు. ఏలూరు ఎస్పీ ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ రసాయన పరిశ్రమలో ఔషధాల్లో వాడే పొడిని తయారు చేస్తున్నట్లు తెలిపారు.

బాధితుల పరిస్థితి విషమంగా ఉంది: సూపరింటెండెంట్‌
అగ్నిప్రమాద బాధితులకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు విజయవాడ జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ తెలిపారు. 12 మందికి 80 శాతానికి పైగా కాలిన గాయాలయ్యాయని చెప్పారు. బాధితుల పరిస్థితి విషమంగా ఉందని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com