ఆ ఊరి అందమే దానికి శాపంగా మారింది..మరి ఆ ఫోటోలు చూసి మీరే చెప్పండి
- April 14, 2022
గలగల పారే నది... ఆ నది ఒడ్డు వెంబడి చిన్న గ్రామం. ఇళ్లన్నీ ఒడ్డునే ఉండడం ఈ గ్రామం విశేషం. అందుకే నిత్యం ఆ గ్రామానికి పర్యాటకులు తిరుగుతూనే ఉంటారు.
ఇప్పుడదే ఆ ఊరి సమస్యగా మారిపోయింది. ఈ అందమైన గ్రామం ఉన్నది ఆస్ట్రేలియాలో. పేరు 'హాల్‌స్టట్'. పర్యాటకులు వస్తే మంచిదేగా, వ్యాపారం బాగా జరుగుతుంది అని వాదించవచ్చు. కానీ వారికి వ్యాపారానికి మించి వారికి తలనొప్పులు ఎక్కువపోతున్నాయి. చిన్న గ్రామం కావడంతో నిత్యం కొత్త మనుషులు తిరగడం వారిలో అసౌకర్యాన్ని, భయాన్ని కూడా పెంచుతోంది.
ఇన్ స్టాగ్రామ్ వల్లే...
ఈ గ్రామంలో వసలి సౌకర్యం లేదు. వచ్చిన ఓ రెండు మూడు గంటల్లో ఊరిని చూసి వెళ్లిపోవాలి. అయినా ఎందుకిలా పర్యాటకులు రోజూ వందల్లో వచ్చిపడతారో తెలుసా? ఇన్‌స్టా పోస్టుల కోసం. ఈ విలేజ్ బ్యాక్‌గ్రౌండ్లో ఇన్‌స్టా రీల్స్, ఫోటోలు తీసుకుని పోస్టు చేస్తే వాటికొచ్చే లైకులు, షేర్లు మామూలుగా ఉండవు. అందుకే ఈ గ్రామం 'ఇన్‌స్టాగ్రామ్ విలేజ్' గా పేరు తెచ్చుకుంది. వేల మంది ఇన్ స్టా ఖాతాల్లో కచ్చితంగా ఈ గ్రామం కనిపిస్తుంది.టూరిస్టుల తాకిడి తట్టుకోలేక ఇకపై వచ్చే వారికి నియమ నిబంధనలు ఏర్పాటుచేయాలనుకుంటున్నట్టు గ్రామపెద్దలు చెబుతున్నారు. రోజులో గ్రామానికి వచ్చే వారి సంఖ్యను కూడా నిర్ణయించి, అంతకుమించి రాకుండా అడ్డుకోవాలని భావిస్తున్నారు. కరోనా వైరస్ వంటి మహమ్మారులు నియంత్రణలో లేని కాలంలో కూడా పర్యాటకులు రావడం వారికి చాలా తలనొప్పిని తెచ్చి పెట్టింది. స్థానిక ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఈ గ్రామాన్ని టూరిస్టుల బారి నుంచి కాపాడాలని నిర్ణయించాయి.





జనాభా ఎంతంటే...
చిన్న కుగ్రామం హాల్‌స్టట్.దీని జనాభా కేవలం 800. ఈ గ్రామానికి ఎప్పుడో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు సాధించింది. ఈ గ్రామాన్ని చూడటానికి రెండు కళ్లూ చాలవు. మంచు కురిసే వేళలో మరింత అందంగా కనిపిస్తుంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







