'ప్రధానమంత్రి సంగ్రాహాలయ' ను ప్రారంభించిన మోదీ
- April 14, 2022
న్యూ ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ప్రధానమంత్రి సంగ్రహాలయ (Prime Minister’s Museum)ను ప్రారంభించారు. స్వాతంత్య్రం అనంతరం ప్రధానిగా బాధ్యతలు అందుకున్న వారికి గుర్తుగా దీనిని నిర్మించినట్లు పేర్కొన్నారు.
పదవీకాలంతో సంబంధం లేకుండా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా.. దీనిని ప్రారంభించారు. స్వాతంత్య్రం తర్వాత భారత పరిస్థితులు వాటిని చక్కదిద్దేందుకు ప్రధానులు చేసిన సేవలను ఇక్కడ ఉంచనున్నారు.
ప్రధానుల నాయకత్వం, దార్శనికత, విజయాల గురించి యువ తరానికి అవగాహన కల్పించడంతో పాటు ప్రేరేపించడమే లక్ష్యంగా రూపొందించారు. 'ప్రధానమంత్రి సంగ్రహాలయ' ప్రారంభోత్సవంలో భాగంగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ తొలి టిక్కెట్‌ను కొనుగోలు చేసి మ్యూజియాన్ని సందర్శించారు.


'ప్రధానమంత్రి సంగ్రహాలయ' టికెట్ ధర ఆన్లైన్లో కొనుగోలు చేస్తే రూ. 100, భారతీయులకు ఆఫ్‌లైన్ మోడ్‌లో రూ. 110 అయితే విదేశీయులకు మాత్రం దీని ధర రూ. 750వరకూ ఏర్పాటు చేశారు.
5 నుంచి 12 ఏళ్లలోపు పిల్లలకు ఆన్లైన్, ఆఫ్‌లైన్ మోడ్లలో టిక్కెట్లు కొనుగోలు చేస్తే 50 శాతం రాయితీ ఇస్తారు. కాలేజీ, హైస్కూల్ విద్యార్థులు బుకింగ్‌లపై 25 శాతం తగ్గింపు పొందొచ్చు.
మ్యూజియం చిహ్నం.. జాతీయతను, ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించేలా ధర్మ చక్ర గుర్తును చేతులతో పట్టుకున్నట్లుగా లోగోను సిద్ధం చేశారు. మ్యూజియంలో మొత్తం 43గ్యాలరీలను ఏర్పాటు చేశారు. స్వాతంత్య్ర పోరాటం నుంచి దేశాభివృద్ధి కోసం పలువురు ప్రధానులు ఎదుర్కొన్న సవాళ్లను ఇక్కడ పొందుపరిచారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







