మే 4, 5న తెలంగాణలో పర్యటించనున్న రాహుల్ గాంధీ..పీసీసీ నేతలతో భేటీ
- April 14, 2022
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఖరారైంది. మే నెల 4న తెలంగాణ పర్యటనకు రానున్న రాహుల్ గాంధీ..రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తారు. మే 4న వరంగల్లో టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారు. ఆ తర్వాతి రోజున…మే 5న బోయిన్పల్లిలో పార్టీ కార్యకర్తలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఖరారైనట్లుగా టీపీసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ శుక్రవారం నాడు హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా ఆయన పీసీసీ కార్యవర్గంతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ భేటీలో రాహుల్ గాంధీ పర్యటన, వరంగల్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లపై ఆయన సమీక్షించనున్నారు.
తాజా వార్తలు
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!
- అనుమతి లేకుండా వ్యక్తిగత డేటా బహిర్గతం..తీవ్రమైన నేరం..!!
- అబుదాబి-దుబాయ్ E11లో EV మెగాహబ్..!!
- 1,197 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- ముసందంలో డిస్కవరీ డైవింగ్ సెంటర్.. టూరిజానికి బూస్ట్..!!
- 2025లో కుటుంబం,బాలల రక్షణకు 4,400 రిపొర్టులు..!!
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం







