'గుడ్ ఫ్రైడే' ప్రాముఖ్యత
- April 15, 2022
క్రైస్తవులకు అత్యంత ముఖ్యమైన పర్వదినాల్లో 'గుడ్ ఫ్రైడే' ఒకటి అని చెప్పవచ్చు.అయితే ఈ ఏడాది ఏప్రిల్ 15న అంటే నేడు క్రైస్తవులందరూ గుడ్ ఫ్రైడేని జరుపుకుంటున్నారు.గుడ్ ఫ్రైడే ని బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు.ఎందుకంటే చరిత్రలో ఈ రోజు కరుణామయుడు, దయామూర్తి యేసుక్రీస్తు కి కల్వరి లో శిలువ వేశారు.గుడ్ ఫ్రైడే అని పిలవడానికి కూడా ఒక కారణం ఉంది.ఏసుప్రభువు మానవజాతి మేలు కోసం ఇదే రోజున తన ప్రాణాలను త్యాగం చేశారని క్రైస్తవులు నమ్ముతారు.ఈరోజు మానవజాతి అన్ని పాపాలకు క్షమాపణను సూచిస్తుందని కూడా విశ్వసిస్తారు.లోక రక్షకుడిగా పేరొందిన ఏసుప్రభువు తన ప్రజల శ్రేయస్సు కోసం ప్రాణాలను సైతం విడిచారని క్రైస్తవులు నమ్ముతారు.అందుకే ఆ రోజును హోలీ ఫ్రైడే, గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు.
యేసుక్రీస్తుకి శిలువ వేసిన రోజుకి గుర్తుగా, క్రైస్తవులు ప్రతి ఏడాది గుడ్ ఫ్రైడేని జరుపుకుంటారు. ఆ రోజున ప్రేమమూర్తి త్యాగాలను స్మరించుకుంటారు.ప్రతి సంవత్సరం, ఈస్టర్ సండే ప్రార్ధనా ఆచారానికి ముందు శుక్రవారం గుడ్ ఫ్రైడే వస్తుంది.ఈ సంవత్సరం ఏప్రిల్ 17న పాస్చల్ పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి ఆదివారం ఈస్టర్ జరుపుకుంటారు, గుడ్ ఫ్రైడే ఏప్రిల్ 15న సెలబ్రేట్ చేసుకుంటారు.
గుడ్ ఫ్రైడే తేదీ, ప్రాముఖ్యత
గ్రెగోరియన్, జూలియన్ క్యాలెండర్‌ల ప్రకారం, గుడ్ ఫ్రైడే తేదీ ప్రతి సంవత్సరం మారవచ్చు. దీనిని హోలీ ఫ్రైడే, గ్రేట్ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు.ఇక్కడ గుడ్ అంటే పవిత్రమైనది అని అర్థం.గుడ్ ఫ్రైడే అనే పదం గాడ్స్ ఫ్రైడే అనే పదం నుంచి వచ్చిందని కూడా చెబుతారు.
ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే గుడ్ ఫ్రైడే
ఈ రోజున ఆంగ్లికన్, క్యాథలిక్, ఈస్టర్న్ ఆర్థోడాక్స్, లూథరన్, మెథడిస్ట్, ఓరియంటల్ ఆర్థోడాక్స్ వంటి క్రైస్తవులందరూ ఉపవాసాన్ని పాటిస్తారు.వారు సర్వశక్తిమంతుడైన ప్రభువు జ్ఞాపకార్థం చర్చిలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు.నేడు చాలా దేశాల్లో గుడ్ ఫ్రైడేను పబ్లిక్ హాలిడే గా ప్రకటిస్తారు.ఇంకా ఈ రోజున చాలా దేశాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది.
జర్మనీలో గుడ్ ఫ్రైడే సందర్భంగా డ్యాన్స్, గుర్రపు పందెం మొదలైన ఎంటర్టైనింగ్ యాక్టివిటీస్ ని నిషేధించే చట్టాలు ఉన్నాయి. ఈ పవిత్ర దినాన ఇలాంటి పనులకు బదులుగా భగవంతుడిని స్మరించుకోవడంపైనే దృష్టి కేంద్రీకరించాలని జర్మనీ చెబుతుంది. జర్మన్ మాట్లాడే దేశాలలో, గుడ్ ఫ్రైడేను కర్ఫ్రైటాగ్ అని పిలుస్తారు. దీనర్థం శుక్రవారం రోజు సంతాపం తెలపాలి.నార్డిక్ దేశాల్లో దీనిని లాంగ్ ఫ్రైడే అని పిలుస్తారు. అయితే గ్రీకు, పోలిష్.. హంగేరియన్ దేశాల్లో గుడ్ ఫ్రైడేను గ్రేట్ ఫ్రైడే అని అంటారు. బల్గేరియన్ మాట్లాడే ప్రాంతాలలో, గుడ్ ఫ్రైడేని గ్రేట్ ఫ్రైడే అని అంటారు. ఇది వారి స్థానిక భాషలో శిలువ వేసిన శుక్రవారం అని అర్థం.
తాజా వార్తలు
- ఓటర్లకు ముఖ్య గమనిక..
- ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..
- తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ కీలక సందేశం
- దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- బీమా క్లెయిమ్ కావాలంటే.. కారు ఓనర్లు ఈ తప్పులు చేయకండి
- ఇతరులపై దాడి చేస్తే.. ఏడాది జైలుశిక్ష, 10,000 దిర్హామ్ల జరిమానా
- సౌదీ పర్యాటక ప్రమోషన్.. 277% పెరిగిన బుకింగ్లు
- బీచ్లో బార్బెక్యూలు.. అధికారుల హెచ్చరిక
- నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి: ఎలక్షన్ కమిషన్
- అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి