యూఏఈ ఇండియన్ స్కూల్స్ కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం
- April 04, 2016
వేలాది మంది స్టూడెంట్స్ ఇండియన్ స్కూల్స్‌కి ఉత్సాహంగా తరలి వెళ్ళారు. ఆదివారం ఉదయం 2016-17 విద్యా సంవత్సరం ప్రారంభం కారణంగా స్కూళ్ళకు విద్యార్థులు వెళ్ళడం జరిగింది. కొత్త పుస్తకాలు, కొత్త యూనిఫామ్, కొత్త షూస్‌తో స్కూల్స్ పరిసర ప్రాంతాలు కళకళ్ళాడాయి. స్కూల్ బస్ స్టాప్స్ వద్ద విద్యార్థుల సందడి ఆదివారం ఉదయం నుంచీ కనిపించింది. కొత్త విద్యా సంవత్సరం కోసం స్కూల్స్ సరికొత్తగా సిద్ధమయ్యాయి. ఈ సంవత్సరం ఇంకా ఆకర్షణీయమైన విద్యా విధానాల్ని అందించనున్నట్లు పలు స్కూల్స్ యాజమాన్యాలు తెలిపాయి. వచ్చే సంవత్సరం 20 కొత్త స్కూల్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది జెమ్స్ సంస్థ అబుదాబీ మరియు దుబాయ్‌లలో కొత్త శాఖలను ప్రారంభించాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







