శరీర కదలికల ఆధారంగా నేరస్తుల గుర్తింపు
- April 04, 2016
దుబాయ్ పోలీసులు త్రిడి కెమెరాల ద్వారా నేరస్తుల్ని గుర్తించేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకున్నారు. ఫోరెన్సిక్ ఇంజనీరింగ్ మరియు న్యూక్లియర్ ఫిజిక్స్‌లానే పలు స్పెషలైజ్డ్ డిపార్ట్‌మెంట్స్‌ని ఏర్పాటు చేసినట్లు దుబాయ్ పోలీస్ ఫోరెన్సిక్ సైన్స్ అండ్ క్రిమినాలజీ డిపార్ట్‌మెంట్ సీనియర్ ఫోరెన్సిక్ టాక్సికాలజిస్ట్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ట్రైనింగ్ డాక్టర్ ఫవాద్ తర్బా చెప్పారు. కినెసియాలజీ అనబడే హ్యూమన్ కైనెటిక్స్, సైంటిఫిక్స్ స్టడీ ఆఫ్ హ్యూమన్ మూమెంట్ వంటి వాటి ద్వారా క్రిమినల్స్‌ని గుర్తించడానికి వీలువుతుందని ఆయన అన్నారు. కైనెటిక్ ఫుట్ ప్రింట్ టెక్నాలజీ ద్వారా నేరస్తుడి మూమెంట్స్‌ని బట్టి గుర్తించవచ్చని ఆయన వివరించారు. నేరస్తుల్ని త్రీడీ కెమెరాల ద్వారా చిత్రీకరించినప్పుడు, వారి బాడీ లాంగ్వేజ్‌ని బట్టి వారు నేరం చేశారనే నిర్ధారణకు రావడం ఈ సరికొత్త టెక్నాలజీ ప్రత్యేకత. ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్స్‌కి సంబంధించిన భవనంలో ఫోరెన్సిక్ బయాలజీ అండ్ డీఎన్‌ఏ, ఫోరెన్సిక్ కెమిస్రస్టీ, ఫోరెన్సిక్ టాక్సికాలజీ, ట్రేస్ ఎవిడెన్స్ మరియు పోస్ట్ బాంబ్ అండ్ ఎక్స్‌ప్లోజివ్స్, టూల్ మార్క్స్ మరియు ఫైర్ ఆర్మ్స్, క్వశ్చన్డ్ డాక్యుమెంట్స్, డిజిటల్ ఫోరెన్సిక్, కంప్యూటర్ క్రైమ్, వాయిస్ ఎనాలసిస్, ఫోరెన్సిక్ వీడియో మరియు ఫొటోగ్రఫీ, ఫైర్ అండ్ ఆర్సన్ ఇన్వెస్టిగేషన్ మరియు ఫింగర్ ప్రింట్ విభాగాలున్నాయని తబ్రా చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







