'నా ఐరోపా యాత్ర' అంటున్న దుబాయ్ వాసి
- April 04, 2016
యాత్రా దర్శినిలో జీవితం కనిపించాలని శాసన సభ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. రాజేష్ వేమూరి రచించిన 'నా ఐరోపా యాత్ర' పుస్తకావిష్కరణ సభ ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో హోటల్ ఐలాపురంలో ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ పుస్తకాన్ని మండలి ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించారు. యాత్ర చరిత్ర ఆయా ప్రాంతాల జనజీవితం, భాష, సంస్కృతి అధ్యయనం చేయటానికి దోహదపడుతుంది అని అన్నారు. యాత్రా చరిత్రలు తెలుగు భాషలో అరుదుగా కనిపిస్తాయని, ఇలాంటి పుస్తకాలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు. కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి జి.వి.పూర్ణ చందు మాట్లాడుతూ పుస్తకాలు మనిషికి ఆత్మ విశ్వాసం, మానసిక ధైర్యాన్ని ఇస్తాయన్నారు. ది కల్చరల్ సెంటర్ సీయీఓ శివ నాగిరెడ్డి మాట్లాడుతూ చాలా మంది ప్రముఖుల జీవితాలు యాత్ర దర్శనాల్లో కనిపిస్తాయన్నారు. వేమూరి రాజేష్ ఐరోపా దేశంలోని అనేక ప్రాంతాలు దర్శించి అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు, సాంఘిక అంశాలను 'నా ఐరోపా యాత్ర' ద్వారా వివరించారని కొనియాడారు. రచయిత రాజేష్ వేమూరి తన యాత్రానుభవాలను నలుగురికీ అందించాలన్న ఉద్దేశ్యంతో ఈ పుస్తకాన్ని రాశానని పేర్కొన్నారు. రచయిత్రి రేజీనా తదితరులు పాల్గొనారు.
ఈ పుస్తకం కేవలం 20 దిర్హమ్స్ మాత్రమే, కావాల్సిన వారు మాగల్ఫ్.కామ్ టీం మొబైల్ నం#0556939320 కి కాల్ చెయ్యగలరు.

తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







