పేరెంట్స్.. స్కూలు బస్సులతో జాగ్రత్త
- April 04, 2016
స్కూల్ విద్యార్థుల్ని రవాణా చేయడానికి మినీ బస్సులను ఉపయోగించడాన్ని ఖతార్‌లో బ్యాన్ చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. అన్ని స్కూల్ బస్సుల్లోనూ ఎలక్ట్రానిక్ ట్రాకింగ్ సిస్టమ్‌ని జీపీఎస్‌తో ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా ఉంది. పేరెంట్స్ ఈ అంశాల్లో అప్రమత్తంగా ఉండాలని, పాఠశాలలపై తమ పిల్లల భద్రతా చర్యలకు సంబంధించి ఒత్తిడి తీసుకురావాలని ట్రాఫిక్ సేఫ్టీ ఎక్స్‌పర్ట్ సూచించారు. మార్చ్ 17న ఓ స్కూల్ బస్సు ప్రమాదానికి గురవడం, ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందడంతో భద్రతా చర్యల విషయంలో రాజీ పడరాదని పేరెంట్స్‌కి హెచ్చరికలు అందుతున్నాయి. బస్సులకి స్పీడ్ గవర్నర్స్ కూడా ఉండాలనేది ఇంకో ముఖ్యమైన డిమాండ్. స్కూలు పిల్లల్ని తరలించే బస్సుల్లో పిల్లల సంఖ్యకి తగ్గట్టుగా అటెండెంట్లు ఉండాలి. స్కూలు బస్సుల వేగం 80 కిలోమీటర్లకు మించరాదు. అలాగే, బస్సు డ్రైవర్లు సుశిక్షితులై ఉండాలి. ఈ అంశాలపై స్కూలు యాజమాన్యాన్ని పేరెంట్స్ ప్రశ్నించగలిగితే, స్కూలు పిల్లలు భద్రంగా ఇంటికి తిరిగొస్తారు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!







