భారత ఆర్మీకి కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే నియామకం
- April 18, 2022
న్యూఢిల్లీ: భారత ఆర్మీకి కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే నియామకం అయ్యారు. ఇందుకు సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన చేసింది.ప్రస్తుతం ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్ ఎంఎం నవరణె స్థానంలో పాండే బాధ్యతలు చేపట్టన్నన్నారు.
బిపిన్ రావత్ మరణంతో ఖాళీ అయిన సీడీఎస్ పోస్ట్‌ను ప్రస్తుత ఆర్మీ చీఫ్ నవరణెతో భర్తీ చేస్తారనే ప్రచారం నడిచింది. అయితే నవరణెఘీ ఏప్రిల్ చివరినాటికి రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో ఆర్మీ కొత్త చీఫ్‌గా.. ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా ఉన్న మనోజ్ పాండే నియామకం ఖరారు అయ్యింది.
విశేషం ఏంటంటే.. ఆర్మీ చీఫ్‌గా నియమితులు కాబోతున్న మొదటి ఇంజినీర్ మనోజ్ పాండేనే కావడం. అంతకు ముందు మనోజ్ పాండే.. ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు దేశాల కమాండింగ్ సెక్షన్లో విధులు నిర్వహించారు. 39 ఏళ్ల ఆర్మీ అనుభవం ఉన్న మనోజ్ పాండే.. ఏప్రిల్ 30న బాధ్యతలు స్వీకరించనున్నారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







