గాట్లు మరియు గాయాలను నుంచి ఉపశమనం కలిగించే ఇంటి నివారణ..
- April 04, 2016
మనిషి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుంతో ఎవరూ చెప్పలేరు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎప్పుడు ఏదో ఘటనలో గాయాల పాలు అవుతారు. చిన్న చిన్న గాట్లు గాయాలు అవుతుంటాయి. చిన్న చిన్న గీతలను సులభంగా సహజమైన ఇంటి నివారణలతో నయం చేసుకోవచ్చు. మచ్చలు మరియు అంటువ్యాధుల అభివృద్ధి ప్రమాదం తగ్గించేందుకు గీతలను మరియు కోతలను శుభ్రంగా మరియు పొడిగా ఉంచాల్సిన అవసరం ఉంది. మనకు వంటగదిలో సులభంగా అందుబాటులో ఉండే పదార్ధాలు గాట్లను నయం చేయటంలో సహాయపడతాయి. ఒకవేళ ఇంటి నివారణలతో నయం కాకపోతే తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించాలి.తేనే గీతలను నయం చేయటంలో చాలా ప్రభావవంతంగా పనిచేసే ఇంటి నివారణలలో ఒకటిగా ఉన్నది. తేనెలో బాక్టీరియా సమ్మేళనాలు ఉండుట వలన ఇన్ ఫెక్షన్స్ ఎదుర్కోవటంలో సహాయం మరియు తేమను నిరోదించటానికి సహాయపడతాయి.ముందుగా గాట్లు మరియు గాయాలను శుభ్రం చేయాలి. ఆ తర్వాత ప్రభావిత ప్రాంతం మీద తేనెను రాయాలి. గాయం నయం అయ్యేవరకు ఈ విధంగా చేయాలి.కలబంద నుండి తీసిన జెల్ గీతల చికిత్సలో అద్భుతంగా పనిచేస్తుంది. మొదట గీతలను శుభ్రం చేసి ఆ తర్వాత కలబందను చర్మం మీద సమంగా రాయాలి. గీతలోకి వ్యర్ధాలు మరియు తేమ ప్రవేశించకుండా కలబంద సహాయపడుతుంది. అంతేకాక నొప్పి నుండి ఉపశమనం కలిగించటమే కాకుండా నయం చేసే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. గీతలను నయం చేయటానికి రోజులో అనేక సార్లు ఈ విధంగా చేయాలి.
వెల్లుల్లి గీతలు, పుళ్ళు మరియు కోతలను నయం చేయటంలో పురాతన కాలం నుండి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే ఒక అద్భుతమైన మైక్రోబియల్ ఏజెంట్ ఉండుట వలన ఇన్ ఫెక్షన్స్ నుండి రక్షించటానికి సహాయపడుతుంది. అయితే వెల్లుల్లి కొంత చికాకును కలిగిస్తుంది. ఒక కప్పు వైన్ లో మూడు వెల్లుల్లి రెబ్బలను వేసి బాగా కలిపి రెండు నుండి నాలుగు గంటల తర్వాత వడగట్టాలి. ఈ ద్రవాన్ని రోజులో కొన్ని సార్లు గాయానికి రాస్తే మంచి పలితం కనపడుతుంది. ఒకవేళ చికాకు దీర్ఘకాలం ఉంటే కనుక ఈ నివారణ చేయటం ఆపేయాలి.పెట్రోలియం జెల్లీ మరియు పంచదార కలిపి ఉపయోగిస్తే గాట్లు మరియు గీతలు తగ్గుతాయి. ఇవి ఇన్ ఫెక్షన్స్ ని అడ్డుకోవటమే కాకుండా నయం చేసే ప్రక్రియను వేగవంతం చేస్తాయి. మొదట గాయం మీద పెట్రోలియం జెల్లీ రాసి దాని మీద పంచదార జల్లాలి. ఆ తర్వాత కట్టు కట్టాలి. గాయం తగ్గేవరకు ప్రతి రోజు ఇదే విధంగా చేయాలి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







