మా నాన్న సూపర్ స్టార్ అంటూ చంద్రబాబు కు నారా లోకేష్ విషెస్
- April 20, 2022
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన రోజు ఈరోజు.ఈ సందర్బంగా పార్టీ నేతలు , కార్య కర్తలు పెద్ద ఎత్తున పుట్టిన రోజు వేడుకలు జరుపుతున్నారు. పలు సేవ కార్య క్రమాలు చేపడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అలాగే సోషల్ మీడియా లోను సినీ , రాజకీయ ప్రముఖులు ఆయనకు విషెష్ అందజేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే.. తన తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు నారా లోకేష్. మా నాన్న సూపర్ స్టార్..అందరి ధైర్యం అని ట్వీట్ చేశారు.జన్మనిచ్చేవారే కాకుండా చదువు చెప్పేవారు, అన్నం పెట్టిన వారు, భయాన్ని పోగొట్టేవారు కూడా తండ్రితో సమానం అని చాణక్యుడు అన్నారు. ఇక తెలుగు వారికి ఆయనంటే ఒక భరోసా అని…లక్షలాది తెలుగుదేశం సైనికులకు ఆయనే ఒక ధైర్యం అని కొనియాడారు.ఈ రకంగా కోట్లాది మందికి తండ్రి అయ్యారు ఆయన… సొంత కుటుంబం కోసం కాకుండా, తెలుగు జాతినే కుటుంబం చేసుకుని, ఆ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఆయనే నా సూపర్ స్టార్… ఆయనే మా నాన్న చంద్రబాబు అంటూ ట్వీట్ చేశారు నారా లోకేష్.
జన్మనిచ్చేవారే కాకుండా చదువు చెప్పేవారు, అన్నం పెట్టిన వారు, భయాన్ని పోగొట్టేవారు కూడా తండ్రితో సమానం అని చాణక్యుడు చెప్పాడు. ఆ ప్రకారంగా చూస్తే ఆయన దార్శనిక పాలన ద్వారా ఎంతో మంది పేదలు కూడా ఉన్నత చదువులు చదవగలిగారు. లక్షల ఉద్యోగాలిచ్చి కోట్లాదిమందికి అన్నదాత అయ్యారు.(1/3) pic.twitter.com/CbWuAAmPhe
— Lokesh Nara (@naralokesh) April 20, 2022
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







