పంజాబ్‌లో అగ్ని ప్రమాదం..ఏడుగురి సజీవ దహనం
- April 20, 2022
లుథియానా: పంజాబ్‌లోని లుథియానాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది.ఈ రోజు తెల్లవారుజామున తాజ్‌పూర్ రోడ్డులోని ఓ గుడిసెలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుని దంపతులు సహా ఐదుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు.వారంతా నిద్రిస్తుండగా మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు.మృతుల్లో దంపతులు, వారి నలుగురు కుమార్తెలు, కుమారుడు (1) ఉన్నారని చెప్పారు.
ఆ సమయంలో వేరే ప్రాంతంలో వీరి మరో కుమారుడు రాజేశ్(17) నిద్రించడంతో అతడు ఒక్కడే ఆ కుటుంబంలో ప్రాణాలతో మిగిలడని వివరించారు.ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకు అగ్ని ప్రమాదంపై సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకునేలోపే ఆ కుటుంబ సభ్యులు మృతి చెందారని అన్నారు.అగ్ని ప్రమాదం ఎలా చోటు చేసుకుందన్న విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







