చైతూ-సాయిపల్లవి జోడీపై జోరుగా సాగుతున్న ప్రచారం..
- April 21, 2022
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సాయిపల్లవి గురించి ఓ వార్త ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది.
సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత ఓ టాప్ హీరోయిన్‌తో చైతూ లవ్‌లో వున్నాడని.. ఆమెనే అతడు పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వచ్చాయి.
తనకు కాబోయే కొత్త సతీమణి కోసమే చైతు జూబ్లిహిల్స్‌లో ఓ కొత్త విల్లా కూడా తీసుకున్నాడని, ఆ ఇంటి పునరుద్దరణ పనులను జయభేరీ సంస్థ చేస్తోందని, ఇక చైతు మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న ఆమె కూడా ఒక హీరోయినే అని తేలింది.
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ? అనే దానిపై చర్చ మొదలైంది. ఈ వార్తలకు ఆజ్యం పోసేలా చైతూ ఫ్లాటులో సాయిపల్లవి వున్నట్లు వార్తలు వస్తున్నాయి. చైతు పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ 'సాయి పల్లవి' అని తెలుస్తోంది.
సాయి పల్లవి షూట్ ఉంటేనే హైదరాబాద్ వస్తుంది. కానీ.. ఆమె గత కొన్ని నెలలుగా పూర్తిగా హైదరాబాద్ కే పరిమితం అయిపోయింది. పైగా చైతు ప్లాట్ లోనే ఉంటుంది. ఆమెను అక్కడ చూసిన ఓ యంగ్ డైరెక్టర్ వల్ల అందరికీ ఈ విషయం తెలిసిపోయింది.
'లవ్ స్టోరీ' సినిమా షూటింగ్ సమయం నుంచే సాయి పల్లవితో చైతు చాలా సన్నిహితంగా ఉంటున్నాడు. సమంతతో విడిపోవడానికి ఇది కూడా ఒక కారణం. వీరి విషయం సమంతకు తెలిసినప్పటి నుంచే.. చైతు - సామ్ మధ్య విబేధాలు వచ్చాయి. అవే విడాకులకు దారితీశాయని టాక్.
ఇప్పుడు చైతుతో సాయి పల్లవి ప్రేమాయణం నడుస్తోంది..నవంబర్ సెకండ్ వీక్‌లో చైతూ-సాయిపల్లవి పెళ్లి ఉండే అవకాశం ఉంది...అందుకే సాయి పల్లవి కొత్త సినిమాలను పెద్దగా అంగీకరించడం లేదు...అంటూ జోరుగా ప్రచారం జరిగిపోతోంది...మరి దీనిపై ఎవరు స్పందిస్తారో వేచి చూడాలి.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







